స‌మాచారం

Home Loan : హోమ్ లోన్ తీసుకుంటున్నారా.. అయితే ముందు ఇవి తెలుసుకోండి..!

Home Loan : అద్దె ఇండ్ల‌లో ఉండే వారు ఎప్ప‌టికైనా సొంత ఇంటిని క‌ట్టుకోవాల‌ని, లేదంటే కొనుక్కోవాల‌ని క‌ల‌లు కంటుంటారు. అందుకు వారి కోసం బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థ‌లు రుణాల‌ను కూడా అందిస్తుంటాయి. ఈ క్ర‌మంలోనే ఎవ‌రైనా తాము కొనాల‌నుకునే ఇంటిని బ‌ట్టి, త‌మ‌కు వ‌స్తున్న ఆదాయానికి అనుగుణంగా ఇంటి రుణాల‌ను తీసుకుంటుంటారు. అయితే కొంద‌రు హోమ్ లోన్స్ తీసుకునేట‌ప్పుడు ప‌లు పొరపాట్ల‌ను చేస్తుంటారు. దీంతో త‌రువాతి కాలంలో అనేక ఇబ్బందుల‌ను ఎదుర్కొంటుంటారు. ఈ క్ర‌మంలోనే హోమ్ లోన్స్ తీసుకునేట‌ప్పుడు ఎవ‌రైనా గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. హోమ్ లోన్ తీసుకునేట‌ప్పుడు సాధార‌ణంగా ఎవ‌రైనా స‌రే అన్ని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థ‌ల్లో విచార‌ణ చేయాలి. లోన్‌కు ఎంత వ‌డ్డీ వేస్తున్నారు, ఎంత ఈఎంఐ అవుతుంది, ఎలాంటి స‌దుపాయాలు ఉంటాయి.. అన్న వివ‌రాల‌ను స‌వివ‌రంగా తెలుసుకున్నాకే.. మీకు న‌చ్చిన ఆర్థిక సంస్థ ద్వారా లోన్ తీసుకోవాలి. దీంతో త‌క్కువ వ‌డ్డీతో ఇంటి రుణం పొందేందుకు అవకాశం ఉంటుంది. కానీ కొంద‌రు ఇలా చేయ‌రు. ఏదో ఒక బ్యాంకుకు వెళ్ల‌డం, వివ‌రాలు పూర్తిగా తెలుసుకోకుండా ఇంటి లోన్ తీసుకోవ‌డం, ఆ త‌రువాత వ‌డ్డీ ఎక్కువ‌వుతుంద‌ని, మ‌రే ఇత‌ర స‌మ‌స్యనో వ‌చ్చింద‌ని చెప్పి వాపోతుంటారు. క‌నుక అలా కాకుండా ఉండాలంటే.. అన్ని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థ‌ల వ‌ద్ద ఎంక్వ‌యిరీ చేశాకే ఇంటి రుణంపై నిర్ణ‌యం తీసుకోవాలి.

2. సాధార‌ణంగా ఏ త‌ర‌హా లోన్ అయినా లేదా క్రెడిట్ కార్డు తీసుకుంటున్నా స‌రే.. ముందుగా సిబిల్ చెక్ చేయాలి. సిబిల్ స్కోరు 750 కి పైన ఉందో లేదో చూశాకే లోన్ అప్లై చేయ‌డం ఉత్త‌మం. లేదంటే.. లోన్ రిజెక్ట్ అయ్యే అవ‌కాశాలు ఉంటాయి. కొంద‌రు సిబిల్ చెక్ చేయ‌కుండా లోన్‌కు అప్లై చేస్తారు. సిబిల్ త‌క్కువ ఉండే స‌రికి లోన్ రాదు. దీంతో వారు ఆందోళ‌న చెందుతారు. అలా కాకుండా ఉండాలంటే.. లోన్‌కు అప్లై చేసే ముందుగానే ఒకసారి సిబిల్ చూసుకోవ‌డం ఉత్త‌మం. లేదంటే అన‌వ‌స‌రంగా లోన్ రిజెక్ట్ అవుతుంది.

Home Loan

3. ఇంటి రుణం తీసుకునే ముందు బ్యాంకులు అందించే ఫీచ‌ర్ల గురిచి వాక‌బు చేయాలి. ముంద‌స్తు రుణం చెల్లింపు చార్జిలు, న్యాయ ప‌ర‌మైన రుసుములు, ప్రాసెసింగ్ ఫీజు ఎంత ఉంటాయో తెలుసుకోవాలి. దీంతో మీరు అధిక చార్జిలు చెల్లించాల్సిన ఇబ్బంది త‌ప్పుతుంది. కొంద‌రు ఇవేవీ చూసుకోకుండానే హ‌డావిడిగా రుణం తీసుకుని ఆన‌క ఇబ్బందుల‌ను ఎదుర్కొంటుంటారు. క‌నుక అలా చేయ‌రాదు. పూర్తిగా వివ‌రాలు తెలుసుకున్నాకే లోన్ కోసం ముందుకు వెళ్లాలి.

4. కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు మీ ప్రొఫైల్ ను బ‌ట్టి ముందుగానే ప్రీ అప్రూవ్డ్ హోమ్ లోన్స్‌ను ఇస్తుంటాయి. అంటే మీకు రుణం ఎంత వ‌ర‌కు వ‌చ్చే అవ‌కాశం ఉందో ముందుగానే ఉజ్జాయింపుగా తెలుసుకోవ‌చ్చ‌న్న‌మాట‌. ఆ స‌దుపాయాన్ని ఉప‌యోగించుకోండి. దాంతో ఇంటి రుణం ఎంత వ‌ర‌కు వ‌స్తుంది, మీరు ఎంత చెల్లించాల్సి ఉంటుంది.. అన్న వివ‌రాలు స్ప‌ష్ట‌మ‌వుతాయి. కొంద‌రు ఇలా చేయ‌కుండా ఇంటి రుణం తీసుకుని ఆ త‌రువాత తాము అనుకున్న మొత్తం రాలేద‌ని కంగారు ప‌డుతుంటారు. అలా కాకుండా ఉండాలంటే ప్రీ అప్రూవ్డ్ లోన్ ఎంత వ‌స్తుందో ముందే తెలుసుకోవ‌డం ఉత్త‌మం.

5. కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు మీకు అవ‌స‌ర‌మైన ఇంటి రుణం క‌న్నా ఎక్కువ మొత్తం ఇస్తామ‌ని చెబుతుంటాయి. కానీ మీకు ఎంత అవ‌స‌ర‌మో అంతే తీసుకోండి. ఎక్కువ తీసుకుంటే ఇబ్బందులు త‌ప్ప‌వ‌న్న విష‌యాన్ని మీరు గ్ర‌హించాలి.

6. ఇంటి రుణం తీసుకునేట‌ప్పుడు బ్యాంకులు మీ చేత సంత‌కాలు చేయించుకునే ప‌త్రాల‌న‌న్నింటినీ క్షుణ్ణంగా చ‌ద‌వాలి. కొంద‌రు అలా చ‌ద‌వ‌క ఆ త‌రువాత వ‌చ్చే ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. క‌నుక స‌మ‌స్య‌లు లేకుండా ఉండాలంటే.. సంత‌కాల‌కు ముందుగానే ప‌త్రాల‌ను బాగా చ‌ద‌వాలి.

7. ఇంటి రుణం తీసుకునే ముందు ఇత‌ర‌ అప్పులు ఏవీ లేకుండా చూసుకోవ‌డం ఉత్త‌మం. లేదంటే.. రుణం అనుకున్న మొత్తం అంద‌క‌పోవ‌డం లేదా రుణం తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌వ‌డం జ‌రుగుతుంటాయి.

8. ఇంటి రుణం తీసుకునే వారు త‌మ పేరిట బీమా చేయించుకోవాలి. అనుకోని స్థితిలో ఆ వ్య‌క్తికి ఏమైనా అయితే ఇంటి నెల‌స‌రి వాయిదాల‌ను చెల్లించ‌డంలో ఇబ్బందులు ఎదురు కాకూడ‌దు. ఆ స‌మ‌స్య‌లు రాకుండా ఉండాలంటే.. రుణం తీసుకున్న వారు బీమా చేయించుకోవాలి.

9. కొంద‌రు ఇంటి రుణాల‌ను త్వ‌ర‌గా చెల్లించాల‌నే ఉద్దేశంతో త‌క్కువ గ‌డువుతో లోన్ల‌ను తీసుకుంటారు. వాటికి నెలా నెలా అధిక మొత్తంలో ఈఎంఐలు చెలిస్తారు. ఇది బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. అనుకోని ప‌రిస్థితులు ఎదురై, డ‌బ్బు స‌రిగా చేతికి అంద‌క‌పోయినా, ఈఎంఐ మొత్తం చెల్లించ‌లేని స్థితిలో ఉన్నా స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. క‌నుక వీలైనంత వ‌ర‌కు ఇంటి రుణం గ‌డువును ఎక్కువ‌గా ఉండేలా చూసుకోవాలి. అయితే ఆదాయం బాగా ఉంద‌నుకున్న వారు తక్కువ గ‌డువుతో ఇంటి రుణం తీసుకోవ‌డ‌మే ఉత్త‌మం. దాంతో వ‌డ్డీ త‌గ్గుతుంది.

10. కొన్ని బ్యాంకులు ఇంటి రుణాల‌పై త‌క్కువ వ‌డ్డీ ఇస్తామ‌ని చెబుతుంటాయి. అది నిజ‌మే అయిన‌ప్ప‌టికీ.. ఇత‌ర చార్జిల రూపంలో మ‌న నుంచి వారు ఎక్కువ వ‌సూలు చూస్తారు. కనుక వాటిని కూడా గ‌మ‌నించాలి.

11. ఇంటి రుణం తీసుకున్న మ‌రుస‌టి నెల నుంచే వాయిదాలు ప్రారంభ‌మ‌వుతాయి. క‌నుక ఆ విషయం తెలుసుకుని మ‌స‌లుకోవాలి. ఈఎంఐ మొత్తాన్ని 10 రోజుల ముందుగానే స‌ర్దుబాటు చేసుకుంటే సుల‌భంగా ఈఎంఐలు చెల్లించ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM