Lord Shiva Darshan : సాధారణంగా హిందువులు ఎవరైనా సరే ఏ దేవున్ని లేదా దేవతను అయినా సరే.. నేరుగా గర్భగుడిలోకి వెళ్లి స్వామివార్ల విగ్రహాలను చూస్తూ దర్శనం చేసుకుంటారు. కానీ ఒక్క శివాలయంలో మాత్రం దైవ దర్శనం భిన్నంగా ఉంటుంది. ముందుగా శివలింగం ఎదురుగా ఉండే నంది కొమ్ముల నుంచి చూస్తూ దర్శనం చేసుకుంటారు. ఆ తరువాతే ఆలయంలోకి వెళ్లి లింగ దర్శనం చేసుకుంటారు. అయితే అసలు ఇలా శివాలయాల్లో ముందుగా నంది కొమ్ముల నుంచే శివలింగాన్ని ఎందుకు చూడాలి ? నేరుగా వెళ్లి శివున్ని దర్శించుకుంటే ఏమవుతుంది ? అలా ఎందుకు చేయరాదు ? అంటే..
శివుడు త్రిమూర్తులలో ఒకడు. కేవలం ఆయనకు మాత్రమే విగ్రహ రూపం ఉండదు. ఆయన్ను లింగ రూపంలో దర్శించుకోవాలి. శివుడు లయ కారకుడు. ఆయనకున్న మూడో కన్ను తెరిస్తే సృష్టి అంతమవుతుంది. సకలం భస్మం అయిపోతుంది. అంతటి శక్తి ఆయన మూడో కన్నుకు ఉంటుంది. కనుక అలాంటి శక్తివంతున్ని నేరుగా దర్శించుకోరాదు. ముందుగా నంది కొమ్ముల నుంచి చూసి లింగ దర్శనం చేసుకున్నాకే ఆలయం లోపలికి వెళ్లి లింగాన్ని చూడాలి. అంతే కానీ నేరుగా శివాలయం గర్భగుడిలోకి వెళ్లరాదు. వెళితే అరిష్టం చుట్టుకుంటుందని పురాణాలు చెబుతున్నాయి.
ఇక నంది కొమ్ముల నుంచి శివలింగాన్ని దర్శనం చేసుకునేటప్పుడు నంది వీపుపై నిమురుతూ మన కుడి చేతితో నంది చెవి మూయాలి. అనంతరం మన మనస్సులో ఉన్న కోరికతోపాటు మన పేరు, మన కుటుంబ సభ్యుల పేర్లు, గోత్రం చెప్పాలి. అలా చెబుతూ శివలింగాన్ని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవెరుతాయని పురాణాలు చెబుతున్నాయి. అలాగే భక్తులకు కైలాస ప్రాప్తి కలుగుతుందట. మరుసటి జన్మ కూడా ఉండదని పురాణాలు చెబుతున్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…