Apple Cider Vinegar For Weight Loss : అధిక బ‌రువు త‌గ్గ‌డం చాలా ఈజీ.. దీన్ని వాడితే చాలు..!

January 14, 2024 10:03 PM

Apple Cider Vinegar For Weight Loss : నేటి త‌రుణంలో అధిక బ‌రువు స‌మ‌స్య జ‌నాల‌ను ఏవిధంగా ఇబ్బందుల‌కు గురి చేస్తుందో అంద‌రికీ తెలిసిందే. అధిక బ‌రువు కార‌ణంగా అనేక మందికి హార్ట్ ఎటాక్స్‌, డ‌యాబెటిస్ వంటి స‌మ‌స్య‌లు కూడా వ‌స్తున్నాయి. దీంతో బ‌రువును తగ్గించుకునేందుకు చాలా మంది ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ ను వాడితే వేగంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. మ‌రి బ‌రువును త‌గ్గించుకునేందుకు దీన్ని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ 2 టీస్పూన్లు, దాల్చిన చెక్క పొడి 2 టీస్పూన్లు తీసుకుని బాగా క‌లిపి ఈ మిశ్ర‌మాన్ని ఒక గ్లాస్ నీటిలో క‌లుపుకుని నిత్యం మూడు పూటలా తాగితే కొద్ది రోజుల్లోనే అధిక బ‌రువు తగ్గుతారు. నిత్యం ఉద‌యం, సాయంత్రం వేళల్లో ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో రెండు టీస్పూన్ల తేనె, యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ల‌ను క‌లుపుకుని తాగితే అధిక బ‌రువు త్వ‌ర‌గా తగ్గుతుంది. మీకు ఇష్ట‌మైన ఏదైనా పండు ర‌సాన్ని తీసి అందులో 2 టీస్పూన్ల యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ ను క‌లిపి తాగినా బ‌రువు త‌గ్గ‌వచ్చు. నిత్యం ఇలా రెండు సార్లు తాగాలి. కానీ అందులో చక్కెర క‌ల‌ప‌రాదు.

Apple Cider Vinegar For Weight Loss how to use it must know
Apple Cider Vinegar For Weight Loss

గ్రీన్ టీ లో యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ ను క‌లుపుకుని తాగినా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. ఫ్రూట్ స‌లాడ్స్, వెల్లుల్లి ర‌సంతో కూడా యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను క‌లిపి తీసుకోవ‌చ్చు. దీని వ‌ల్ల అధిక బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతారు. యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌ను పైన చెప్పిన విధంగా తాగితే కేవ‌లం బ‌రువు త‌గ్గ‌డం మాత్ర‌మే కాదు, మ‌ధుమేహం, గుండె జ‌బ్బులు కూడా రాకుండా ఉంటాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now