
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. Railway Recruitment Boards (RRBs) 2026 గ్రూప్ D నియామకాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాయి. మొత్తం 22,000 ఖాళీలు భర్తీ చేయనున్న ఈ నోటిఫికేషన్‌కు ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ rrbapply.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు ఎంపికైన వారికి ప్రారంభ బేసిక్ పే నెలకు రూ.18,000గా ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు మార్చి 2, 2026 (రాత్రి 11:59 వరకు) గడువు ఉంది. మొదట జనవరి 21 నుంచి ప్రారంభం కావాల్సిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పరిపాలనా కారణాలతో వాయిదా పడింది.
అర్హతలు (Eligibility)..
- అభ్యర్థుల వయస్సు 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి.
- OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సు సడలింపు వర్తిస్తుంది.
- ఆధార్ ఆధారిత వెరిఫికేషన్ తప్పనిసరి.
- పేరు, జన్మతేది, ఫొటో వంటి వివరాలు 10వ తరగతి సర్టిఫికేట్‌తో సరిపోలేలా ఉండాలి.
ఎంపిక విధానం (Selection Process)..
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT).
- ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) – CBTలో అర్హత సాధించిన వారికి మాత్రమే.
దరఖాస్తు ఫీజు (Application Fee)..
జనరల్ / OBC / EWS అభ్యర్థులకు రూ.500. (ఇతర కేటగిరీలకు సంబంధించిన ఫీజు నిబంధనలు అధికారిక నోటిఫికేషన్లో చూడవచ్చు).
RRB గ్రూప్ D 2026కు దరఖాస్తు విధానం..
- అధికారిక వెబ్సైట్ rrbapply.gov.inకి వెళ్లండి.
- హోమ్‌పేజీలో Recruitment for various posts in Level 1 of 7th CPC Matrix లింక్‌పై క్లిక్ చేయండి.
- ఆధార్ లేదా RRB క్రెడెన్షియల్స్‌తో లాగిన్ అవ్వండి.
- అవసరమైన వివరాలు నమోదు చేసి దరఖాస్తు సమర్పించండి.
రైల్వేలో స్థిరమైన ఉద్యోగం కోరుకునే యువతకు ఇది కీలక అవకాశం. గడువు దగ్గరపడేలోపు ఆధార్ వివరాలు సరిచూసుకుని, దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
గమనిక: అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను చదవగలరు.








