రాత పరీక్ష లేకుండానే జాబ్.. నెలకి 50,000 పైనే జీతం.. పూర్తి వివరాలు మీకోసం..!

September 27, 2023 10:57 AM

మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే ఇదే మీకు గుడ్ న్యూస్. తెలుగు వాళ్ళ కోసం ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా కూడా వదలకుండా మేము మీకోసం తీసుకు వస్తున్నాము. ఆసక్తి, అర్హత ఉన్న వాళ్ళు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, జిల్లా నేషనల్ హెల్త్ మిషన్ కింద వివిధ కార్యక్రమాల్లో కాంట్రాక్ట్ ప్రతిపదికన అండ్ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.

దరఖాస్తు చేసుకోవడానికి ఈ కింది అర్హతలు ఉండాలి. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్ చేసి, ఉద్యోగాన్ని ఇస్తారు. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలను చూసేద్దాం. ఈ నోటిఫికేషన్ ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ హెల్త్ మెడికల్ అండ్ కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా విడుదల చేయబడింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 54 పోస్టులను భర్తీ చేయబోతున్నారు. వయసు విషయానికి వస్తే ఖచ్చితంగా 42 ఏళ్లు మించకుండా ఉండాలి.

jobs in ap government social welfare department

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వయోపరిమితిలో వయోసడలింపు ఉంటుంది. ఐదు సంవత్సరాలు ఎక్స్ సర్వీస్ మెన్ కి, మూడు సంవత్సరాలు శారీరక వికలాంగులకు, 10 సంవత్సరాలు మినహాయింపు ఉంది. ఇక జీతం విషయానికి వస్తే.. జీతం కింద 12 వేల నుండి 54 వేల వరకు ఇస్తారు. సొంత గ్రామంలోనే ఉద్యోగాన్ని పొందవచ్చు. దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే.. దరఖాస్తు ఫీజు కింద 300 రూపాయలు చెల్లించాలి.

ఇక అర్హత వివరాల్లోకి వెళితే.. టెన్త్, ఇంటర్, ఐటిఐ లేదా డిగ్రీ, డిప్లమో, ఎంఎస్సీ, ఎంబిబిఎస్ పూర్తి చేసిన వాళ్లు, పోస్టులను బట్టి అప్లై చేసుకోవాలి. పోస్టులను బట్టి అర్హతలు ఉన్నాయి చూసుకోండి. ఫిజియోథెరపిస్ట్, మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ ఇలా పలు పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 30 వరకు అవకాశం ఉంది. రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఇస్తారు. ఇంటర్వ్యూ ఉంటుంది. పూర్తి వివరాల కోసం కింది వెబ్సైట్ మీద క్లిక్ చేయండి.

https://cdn.s3waas.gov.in/s333e75ff09dd601bbe69f351039152189/uploads/2023/09/2023092544.pdf

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now