ఉద్యోగాలు

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఉద్యోగాలు.. జీతం రూ.12 ల‌క్ష‌లు..

దేశంలోని ప్ర‌ముఖ ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థ‌ల్లో ఒక‌టైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ మేర‌కు ఐబీపీఎస్ ద్వారా ఈ నియామ‌క ప్ర‌క్రియ చేప‌ట్ట‌నున్నారు. మొత్తం 500 రిలేష‌న్‌షిప్ మేనేజ‌ర్ పోస్టుల‌ను ఈ నియామ‌క ప్ర‌క్రియ‌లో భాగంగా భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు గాను ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఫిబ్ర‌వ‌రి 7 వ‌ర‌కు గ‌డువు విధించారు. ఆస‌క్తి, అర్హ‌త ఉన్న‌వారు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. మ‌రిన్ని వివ‌రాల‌కు అధికారిక వెబ్‌సైట్ https://www.hdfcbank.com/ ను అభ్య‌ర్థులు సంద‌ర్శించ‌వ‌చ్చు.

మొత్తం 500 రిలేష‌న్‌షిప్ మేనేజ‌ర్ పోస్టులు ఖాళీ ఉండ‌గా.. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసే అభ్య‌ర్థులు గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి క‌నీసం 50 శాతం మార్కుల‌తో డిగ్రీ చేసి ఉండాలి. 1-10 సంవ‌త్స‌రాల ఉద్యోగానుభ‌వం ఉండాలి. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ అయిన ఫిబ్ర‌వ‌రి 7 వ‌ర‌కు 35 ఏళ్లు మించ‌కూడ‌దు. జీతం ఏడాదికి రూ.3 ల‌క్ష‌ల నుంచి రూ.12 ల‌క్ష‌ల వ‌ర‌కు ఇస్తారు.

ఆన్‌లైన్ ప‌రీక్ష‌, వ్య‌క్తిగ‌త ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఎక్క‌డైనా ప‌ని చేయాల్సి ఉంటుంది. విశాఖ ప‌ట్నం, ఢిల్లీ, అహ్మ‌దాబాద్‌, వ‌డోద‌ర‌, బెంగళూరు, మంగ‌ళూరు, భోపాల్‌, ముంబై, పుణె, అమృత‌స‌ర్‌, జ‌య‌పుర‌, హైద‌రాబాద్‌, ల‌క్నో, కోల్‌క‌తా న‌గ‌రాల్లో ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. ఆన్‌లైన్ ప‌రీక్ష‌ను మార్చిలో నిర్వ‌హిస్తారు. తేదీని త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తారు. రాత ప‌రీక్ష ఇంగ్లిష్ మీడియంలో ఉంటుంది. 100 ప్ర‌శ్న‌ల‌కు 100 మార్కులు సాధించాలి. త‌ప్పు స‌మాధానానికి 1/4 మార్కు కోత విధిస్తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM

‘దేవర’ సెట్స్‌లో మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్.. రాజమౌళి నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న వార‌ణాసి చిత్ర షూటింగ్‌ను ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్‌టీఆర్…

Thursday, 16 April 2026, 3:36 PM

మళ్ళీ వాయిదా పడ్డ రామ్ చరణ్ ‘పెద్ది’.. జూన్‌కు వెళ్ళిన మెగా మూవీ! కారణం ఏంటంటే?

రామ్ చ‌రణ్ హీరోగా న‌టిస్తున్న పెద్ది మూవీ విడుద‌ల‌ మ‌రోసారి వాయిదా ప‌డింది. మూవీ అనుకున్న తేదీ ప్ర‌కార‌మే రిలీజ్…

Thursday, 16 April 2026, 11:18 AM

‘బద్రి’లో నా దుస్తులు నేనే డిజైన్ చేసుకున్నా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను సినిమాల్లో న‌టించిన స‌మ‌యంలో త‌న దుస్తుల‌ను తానే డిజైన్ చేసుకుని ధ‌రించే దాన్న‌ని న‌టి రేణు దేశాయ్ తెలిపారు.…

Wednesday, 15 April 2026, 5:58 PM

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM