ఉద్యోగాలు

ఈఎస్ఐలో ఉద్యోగాలు.. ఎవ‌రు అర్హులు అంటే..?

న్యూఢిల్లీలో ఉన్న ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ (ESIC) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ మేర‌కు ESIC హెడ్ క్వార్టర్స్ వారు నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న ఈఎస్ఐసీ డిస్పెన్స‌రీలు లేదా హాస్పిట‌ల్స్‌లో 608 ఇన్సూరెన్స్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) నిర్వ‌హించే కంబైన్డ్ మెడిక‌ల్ స‌ర్వీస్ ఎగ్జామినేష‌న్ 2022/2023లో ఉత్తీర్ణ‌త సాధించిన అభ్య‌ర్థులు మాత్ర‌మే ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేయాల్సి ఉంటుంది.

ఈ పోస్టుల‌కు గాను ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఇప్ప‌టికే ప్రారంభం కాగా జ‌న‌వ‌రి 31వ తేదీ వ‌ర‌కు గ‌డువు విధించారు. ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. మ‌రిన్ని వివ‌రాల‌కు గాను https://www.esic.in/IMOG2/Login.aspx అనే అధికారిక వెబ్‌సైట్‌ను అభ్య‌ర్థులు సందర్శించ‌వ‌చ్చు. ఈ వెబ్‌సైట్ లో పూర్తి వివ‌రాల‌ను కూడా తెలుసుకోవ‌చ్చు. మొత్తం 608 ఇన్సూరెన్స్ మెడిక‌ల్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. యూఆర్ కేట‌గిరిలో 254 ఖాళీలు ఉండ‌గా, ఎస్సీ విభాగంలో 63, ఎస్‌టీ 53, ఓబీసీ 178, ఈడ‌బ్ల్యూఎస్ విభాగంలో 60 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఎంబీబీఎస్ డిగ్రీ అర్హ‌త‌తోపాటు రొటేటింగ్ ఇంట‌ర్న్‌షిప్ పూర్త‌యి ఉండాలి. యూపీఎస్సీ నిర్వ‌హించే కంబైన్డ్ మెడిక‌ల్ స‌ర్వీసెస్ ఎగ్జామినేష‌న్ 2022/23 డిస్‌క్లోజ‌ర్ లిస్టులో ఎంపికైన అభ్య‌ర్థులు మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు రూ.56,100 నుంచి రూ.1,77,500 వ‌ర‌కు వేత‌నం ఇస్తారు. వ‌య‌స్సు 2022 ఏప్రిల్ 26 నాటికి 35 ఏళ్లు మించ‌కూడ‌దు. యూపీఎస్సీ నిర్వ‌హించే కంబైన్డ్ మెడిక‌ల్ స‌ర్వీస్ ఎగ్జామినేష‌న్ తోపాటు రిజ‌ర్వేష‌న్ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఓటీటీలోనూ ప్రభాస్ ‘రాజాసాబ్’ ఫెయిల్.. సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్!

మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్, మాళ‌విక మోహ‌న‌న్‌, నిధి అగ‌ర్వాల్‌, రిధి కుమార్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌చ్చిన ది రాజా సాబ్…

Saturday, 7 February 2026, 10:28 PM

విడుదలకు ముందే యష్ ‘టాక్సిక్’ రికార్డ్.. తెలుగు రాష్ట్రాల్లో రూ.120 కోట్ల డీల్!

కేజీఎఫ్ స్టార్ య‌ష్ నటిస్తున్న భారీ చిత్రం టాక్సిక్ విడుదలకు ముందే సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ చిత్రానికి సంబంధించిన…

Saturday, 7 February 2026, 7:25 PM

మోటోరోలా ఎడ్జ్ 50 ప్రొపై భారీ ఆఫర్.. అమెజాన్‌లో రూ.12,600 పైగా తగ్గింపు!

స్మార్ట్‌ఫోన్ ను కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. Motorola ఎడ్జ్ 50 ప్రొ మోడల్‌పై Amazon భారీ ఆఫర్ అందిస్తోంది.…

Saturday, 7 February 2026, 4:50 PM

సైబర్ మోసాల బాధితులకు ఆర్‌బీఐ ఊరట.. రూ.25 వేల నష్టపరిహారం!

దేశ ఆర్థిక వ్యవస్థలో వినియోగదారుల భద్రతను బలోపేతం చేయడం, ఆర్థిక సమావేశాన్ని విస్తరించడం, అలాగే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, అర్బన్ కో-ఆపరేటివ్…

Saturday, 7 February 2026, 2:28 PM

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 5,138 ఉద్యోగాలు.. రేపటి నుంచే దరఖాస్తులు!

దేశవ్యాప్తంగా భారీ నియామకాలకు Punjab National Bank (PNB) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 5,138 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి…

Saturday, 7 February 2026, 12:23 PM

విడాకుల వార్తలకు ప్రియాంక చెక్.. నిక్ జోనాస్‌పై ప్రేమతో ఎమోషనల్ పోస్ట్!

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ తన అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగిస్తూనే వ్యక్తిగత జీవితానికి కూడా సమాన ప్రాధాన్యం ఇస్తూ…

Saturday, 7 February 2026, 10:58 AM

తిరుమ‌ల‌ లడ్డూ అంశంలో నిజాలు బయటపెడతాం: వైఎస్ జగన్

తిరుమ‌ల‌ లడ్డూ వివాదంలో కూటమి ప్రభుత్వపు జంగిల్ రాజ్ ను, అసత్య ప్రచారాన్ని బట్టబయలు చేయడానికి సుప్రీంకోర్టు, జాతీయ మానవ…

Friday, 6 February 2026, 9:43 PM

భారత సైన్యంలో లా ఆఫీసర్ ఉద్యోగాలు.. జడ్జ్ అడ్వకేట్ జనరల్ ఎంట్రీకి నోటిఫికేషన్!

లా గ్రాడ్యుయేట్లకు భారత సైన్యంలో అధికారిగా సేవలందించే అరుదైన అవకాశం లభించింది. Indian Army జడ్జ్ అడ్వకేట్ జనరల్ (JAG)…

Friday, 6 February 2026, 7:50 PM