ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి…!

October 3, 2023 12:45 PM

ఏదైనా మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే, మీకు ఒక గుడ్ న్యూస్. ఈరోజు మేము ఒక నోటిఫికేషన్ ని మీ కోసం తీసుకువచ్చాము. తెలుగు వాళ్ళ కోసం, ఏ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చినా వదలకుండా, మీకోసం తీసుకు వస్తున్నాము. మరి ఈ అర్హత ఉన్నట్లయితే, వెంటనే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను చూసేద్దాం. ప్రముఖ సంస్థ అయినటు వంటి రిలయన్స్ రిటైల్ నుండి భారీ నోటిఫికేషన్ వచ్చింది. వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి, వాళ్లే ఉద్యోగాన్ని ఇస్తారు.

అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. మరి ఇక ఆలస్యం ఎందుకు వాటి గురించి తెలుసుకోండి. దేశం లోనే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో ఒకటైన, రిలయన్స్ రిటైల్స్ సంస్థ నుండి ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఉద్యోగాలని విడుదల చేయడం జరిగింది. ఇక అర్హత విషయానికి వస్తే.. ఇంటర్, డిగ్రీ, బీటెక్ ఎలక్ట్రికల్, సివిల్ స్ట్రీమ్ వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. 0 నుండి 2 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.

customer support jobs in reliance

స్మార్ట్ ఫోన్ వినియోగం, స్థానిక భాష మాట్లాడడం, సేల్స్ మరియు కస్టమర్ హ్యాండ్లింగ్ నైపుణ్యాలు కలిగి ఉండడం చాలా అవసరం. ఇక వయస్సు విషయానికి వస్తే… ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవాలనుకున్న వాళ్ళ వయసు, కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. మొబైల్లో రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఈ పోస్టులని భర్తీ చేయబోతున్నారు. జీతం విషయానికి వస్తే… నెలకి 20వేల నుండి 46 వేల వరకు ఇస్తారు. అలానే ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఎలాంటి ఫీజు చెల్లించకుండానే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now