ఉద్యోగాలు

టెన్త్‌, ఇంట‌ర్, డిగ్రీ చ‌దివిన వారికి CSIR – NIISTలో ఉద్యోగాలు.. జీతం రూ.50వేలు..

CSIR నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంట‌ర్‌డిసిప్లిన‌రీ సైన్స్ అండ్ టెక్నాల‌జీ (NIIST) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. టెక్నిక‌ల్ అసిస్టెంట్‌, టెక్నిషియ‌న్‌, జూనియ‌ర్ స్టెనోగ్రాఫ‌ర్‌, జూనియ‌ర్ సెక్రెటేరియ‌ట్ అసిస్టెంట్‌, జూనియ‌ర్ హిందీ ట్రాన్స్‌లేట‌ర్ విభాగాల్లో ఈ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌డానికి నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టుల‌కు గాను ఏ రాష్ట్రానికి చెందిన అభ్య‌ర్థులు అయినా స‌రే ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీ చేసిన వారు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ పోస్టుల‌కు గాను ఆన్‌లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ అప్లికేష‌న్‌లు ఇప్ప‌టికే ప్రారంభం అయ్యాయి. ద‌ర‌ఖాస్తుల‌ను స‌మ‌ర్పించేందుకు మార్చి 14ను చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు.

ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసే అభ్య‌ర్థుల వ‌య‌స్సు 18 నుంచి 30 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థుల‌కు 5 సంవ‌త్స‌రాలు, ఓబీసీ అభ్య‌ర్థుల‌కు 3 ఏళ్లు గ‌రిష్ట వ‌యో ప‌రిమితిలో స‌డ‌లింపులు ఇచ్చారు. టెక్నిక‌ల్ అసిస్టెంట్‌, టెక్నిషియ‌న్ పోస్టుల‌కు గాను టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివి ఉండాలి. జూనియ‌ర్ స్టెనోగ్రాఫ‌ర్‌, జూనియర్ సెక్రెటేరియ‌ట్ అసిస్టెంట్ పోస్టుల‌కు ఇంట‌ర్ లేదా తత్స‌మాన అర్హ‌త‌లో ఉత్తీర్ణులు అయి ఉండాలి. జూనియ‌ర్ హిందీ ట్రాన్స్‌లేట‌ర్ పోస్టుల‌కు సంబంధిత స‌బ్జెక్టులో పీజీ చేసి ఉండాలి.

అప్లికేష‌న్ ఫీజును రూ.500గా నిర్ణ‌యించారు. మ‌హిళ‌లు, ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ఎలాంటి ద‌ర‌ఖాస్తు ఫీజు లేదు. ద‌ర‌ఖాస్తు రుసుమును ఆన్ లైన్‌లో నెట్ బ్యాంకింగ్‌, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల ద్వారా చెల్లించ‌వ‌చ్చు. ఈ పోస్టుల‌కు రాత ప‌రీక్ష‌, స్కిల్ టెస్ట్‌, ధ్రువ ప‌త్రాల ప‌రిశీల‌న ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ఈ పోస్టుల‌కు ఎంపికైన అభ్య‌ర్థుల‌కు రూ.30 వేల నుంచి రూ.50వేల వ‌ర‌కు నెల‌వారి వేత‌నం చెల్లిస్తారు. దీంతోపాటు ప్ర‌త్యేక అల‌వెన్స్‌ల‌ను కూడా చెల్లిస్తారు. అభ్య‌ర్థులు మ‌రిన్ని వివ‌రాల‌కు గాను https://www.niist.res.in/ అనే అధికారిక సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు. అందులోనే ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో అప్లై కూడా చేయ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM

‘దేవర’ సెట్స్‌లో మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్.. రాజమౌళి నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న వార‌ణాసి చిత్ర షూటింగ్‌ను ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్‌టీఆర్…

Thursday, 16 April 2026, 3:36 PM

మళ్ళీ వాయిదా పడ్డ రామ్ చరణ్ ‘పెద్ది’.. జూన్‌కు వెళ్ళిన మెగా మూవీ! కారణం ఏంటంటే?

రామ్ చ‌రణ్ హీరోగా న‌టిస్తున్న పెద్ది మూవీ విడుద‌ల‌ మ‌రోసారి వాయిదా ప‌డింది. మూవీ అనుకున్న తేదీ ప్ర‌కార‌మే రిలీజ్…

Thursday, 16 April 2026, 11:18 AM

‘బద్రి’లో నా దుస్తులు నేనే డిజైన్ చేసుకున్నా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను సినిమాల్లో న‌టించిన స‌మ‌యంలో త‌న దుస్తుల‌ను తానే డిజైన్ చేసుకుని ధ‌రించే దాన్న‌ని న‌టి రేణు దేశాయ్ తెలిపారు.…

Wednesday, 15 April 2026, 5:58 PM

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM