
అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కేంద్రం (Centre for Development of Advanced Computing) సీ-డాక్ 2026 సంవత్సరానికి గాను భారీ నియామక ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సీ-డాక్ కేంద్రాల్లో ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ టెక్నీషియన్ సహా సాంకేతిక, పరిపాలనా విభాగాల్లో మొత్తం 805 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఈ నియామక ప్రక్రియ ద్వారా సాఫ్ట్వేర్ అభివృద్ధి, ఎలక్ట్రానిక్స్, కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ, హై-పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, ప్రాజెక్ట్ సపోర్ట్ వంటి కీలక రంగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 2, 2026 నుంచి ప్రారంభమైంది. ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణయించారు.
ఖాళీల వివరాలు
సీ-డాక్ రిక్రూట్మెంట్ 2026 కింద మొత్తం 805 పోస్టులు ప్రకటించారు. వీటిలో ప్రధానంగా. ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ టెక్నీషియన్, ఇతర సాంకేతిక, ప్రాజెక్ట్ ఆధారిత సపోర్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలు దేశవ్యాప్తంగా ఉన్న సీ-డాక్ కేంద్రాల్లో విభజించబడ్డాయి. భవిష్యత్ సాంకేతిక రంగాలైన కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ డిజైన్ వంటి విభాగాల్లో నియామకాలు జరుగుతాయి. ఎక్కువ పోస్టులు ప్రాజెక్ట్ ఆధారిత ఒప్పంద విధానంలో ఉండే అవకాశం ఉంది.
అర్హతలు, వయో పరిమితి
- పోస్టును బట్టి అర్హతలు మారుతాయి.
- ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు సంబంధిత విభాగంలో బీఈ / బీటెక్, ఎంఈ / ఎంఎటెక్, ఎంసీఏ లేదా సమాన అర్హత అవసరం.
- టెక్నీషియన్, ఇతర సపోర్ట్ పోస్టులకు డిప్లొమా లేదా నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హత ఉండాలి.
- అధికారిక ప్రకటనలో పేర్కొన్న వయో పరిమితిని అభ్యర్థులు తప్పనిసరిగా పాటించాలి.
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయో సడలింపు వర్తిస్తుంది.
- కొన్ని పోస్టులకు సంబంధిత రంగంలో పని అనుభవం కూడా అవసరమయ్యే అవకాశం ఉంది.
దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ
దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో మాత్రమే స్వీకరిస్తారు. ఆఫ్‌లైన్ దరఖాస్తులు అంగీకరించరు. ఎంపిక ప్రక్రియలో అర్హతలు, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్టింగ్, పోస్టును బట్టి లిఖిత పరీక్ష / ఇంటర్వ్యూ, చివరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాయి. ఈ దశల్లో ప్రదర్శన ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
అభ్యర్థులకు సూచన
దరఖాస్తు చేసే ముందు పోస్టు వారీ అర్హతలు, వయో పరిమితి, అనుభవం, ఎంపిక విధానం వంటి వివరాలను అధికారిక నోటిఫికేషన్లో జాగ్రత్తగా పరిశీలించాలని సీ-డాక్ సూచించింది. తాజా సమాచారం కోసం సీ-డాక్ అధికారిక వెబ్‌సైట్‌ను తరచుగా పరిశీలించాలని అభ్యర్థులకు సూచిస్తున్నారు. దేశంలో అత్యాధునిక సాంకేతిక ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశాన్ని అందించే ఈ నియామకం, యువ ఇంజనీర్లు, టెక్నికల్ నిపుణులకు కీలక అవకాశంగా మారనుంది.
గమనిక: అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్ (cdac.in) లోని పూర్తి వివరాలను ఒకసారి తనిఖీ చేసుకోగలరు. C-DAC Careers అనే లింక్‌ను సందర్శిస్తే నేరుగా వివరాలు తెలుస్తాయి.








