వినూత్న‌మైన ఐడియా.. అత‌ని జీవితాన్నే మార్చేసింది.. రూ.కోట్లు సంపాదిస్తున్నాడు..!

September 9, 2021 8:49 PM

స్వ‌యం ఉపాధి మార్గాల ద్వారా డ‌బ్బు సంపాదించాల‌ని, ఉన్న‌త శిఖ‌రాల‌కు చేరుకోవాలనే ఆలోచన ఉంటే చాలు. దాంతో ఎంత‌టి వారైనా ఏమైనా సాధించ‌వచ్చు. కొద్దిగా క‌ష్ట‌ప‌డుతూ ఓపిగ్గా, మెళ‌కువ‌గా వ్యాపారం చేస్తే ఎవ‌రైనా స‌క్సెస్ సాధిస్తారు. స‌రిగ్గా ఇవే విష‌యాల‌ను అల‌వ‌ర్చుకున్నాడు. క‌నుక‌నే అత‌ను పలు మార్లు ఫెయిల్ అయినా.. చివ‌ర‌కు వినూత్న ఐడియాతో ఏటా రూ.కోట్లు సంపాదిస్తున్నాడు. అతనే కేశ‌వ్ రాయ్.

వినూత్న‌మైన ఐడియా.. అత‌ని జీవితాన్నే మార్చేసింది.. రూ.కోట్లు సంపాదిస్తున్నాడు..!

కేశ‌వ్ రాయ్ స్కూల్‌లో యావ‌రేజ్ స్టూడెంటే. కానీ సొంతంగా ఏదైనా చేయాల‌ని, ఉన్న‌త శిఖ‌రాల‌కు చేరుకోవాల‌ని విపరీతంగా ఆలోచించాడు. దీంతో అత‌నికి సెమీ ఆటోమేటిక్ బైక్ క‌వ‌ర్ల‌ను త‌యారు చేయాల‌నే ఆలోచ‌న వ‌చ్చింది. అందులో భాగంగానే 2016లో అత‌ను బైక్ బ్లేజర్ అనే సంస్థ‌ను ఏర్పాటు చేశాడు. 2017లో త‌న ప్రొడ‌క్ట్ కు పేటెంట్ పొందాడు. త‌రువాత అత‌ను వెన‌క్కి తిరిగి చూడ‌లేదు. దిన దిన ప్ర‌వ‌ర్థ‌మానం అన్న‌ట్లు ఎదిగాడు.

వినూత్న‌మైన ఐడియా.. అత‌ని జీవితాన్నే మార్చేసింది.. రూ.కోట్లు సంపాదిస్తున్నాడు..!

కేశ‌వ్ రాయ్ సొంతంగా త‌యారు చేసిన సెమీ ఆటోమేటిక్ బైక్ క‌వ‌ర్ ద్విచ‌క్ర‌వాహ‌న‌దారుల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. దాన్ని వాహ‌నానికి అమ‌ర్చితే చాలు 30 నిమిషాల్లో క‌వ‌ర్ అవుతుంది. దీంతో వ‌ర్షం ప‌డినా ఏమీ కాదు. వాహ‌నం పొడిగా ఉంటుంది. ఈ సెమీ ఆటోమేటిక్ బైక్ క‌వ‌ర్‌ల‌ను రూ.780, రూ.850 ధ‌ర‌ల‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు. అన్ని ఈ-కామ‌ర్స్ సైట్ల‌లోనూ ఈ క‌వ‌ర్స్ అందుబాటులో ఉన్నాయి.

వినూత్న‌మైన ఐడియా.. అత‌ని జీవితాన్నే మార్చేసింది.. రూ.కోట్లు సంపాదిస్తున్నాడు..!

కేశ‌వ్ రాయ్ మొద‌ట్లో త‌న బైక్ క‌వ‌ర్ల‌ను అమ్మేందుకు కొంత క‌ష్ట‌ప‌డ్డాడు. కానీ వాటి గురించి తెలిశాక చాలా మంది వాటిని కొన‌డం మొద‌లు పెట్టారు. సోష‌ల్ మీడియాలో వాటి గురించి అత‌ను విస్తృతంగా ప్ర‌చారం చేశాడు. దీంతో త‌క్కువ స‌మ‌యంలోనే ఆ బైక్ క‌వ‌ర్ల‌కు ఆద‌ర‌ణ ల‌భించింది. ఇక 5 ఏళ్ల కాలంలో అత‌ను 75వేల‌కు పైగా అలాంటి క‌వ‌ర్ల‌ను విక్ర‌యించ‌గా.. ప్ర‌స్తుతం అత‌నికి ఏడాదికి రూ.1.30 కోట్ల ట‌ర్నోవ‌ర్ వ‌స్తోంది.

కేశ‌వ్ రాయ్‌కు చెందిన బైక్ బ్లేజ‌ర్ పరిశ్ర‌మ మొద‌ట త‌న ఇంటి టెర్రేస్‌పై ప్రారంభ‌మైంది. ఇప్పుడు ఢిల్లీ, ఘ‌జియాబాద్‌ల‌లో రెండు ప‌రిశ్ర‌మ‌ల‌ను ఏర్పాటు చేసి అత‌ను ఆ బైక్ క‌వ‌ర్ల‌ను ఉత్ప‌త్తి చేస్తున్నాడు. త్వ‌ర‌లో మ‌రిన్ని ప్రాంతాల్లో త‌యారీ ప‌రిశ్ర‌మ‌ల‌ను ఏర్పాటు చేస్తాన‌ని చెబుతున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment