Sesame Laddu : 200 ఏళ్లు బలంగా ఉంటారు.. ముసలితనం రాదు, నడవలేని వారు సైతం లేచి పరుగెడతారు..!

April 15, 2023 10:45 AM

Sesame Laddu : మన పెద్దలు నువ్వులు, నువ్వుల నూనెను ఎన్నో రకాలుగా ఉపయోగించేవారు. నువ్వుల నూనె అత్యంత ఉత్తమమైందిగా చెబుతారు. ఆయుర్వేదంలో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. నువ్వుల నూనెతో శరీరాన్ని మసాజ్‌ చేస్తారు. దీంతో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇక నువ్వులను కూడా మనం తరచూ ఉపయోగిస్తూనే ఉంటాం. నువ్వులతో ఎన్నో రకాల తీపి వంటకాలను చేస్తారు. వాటిల్లో నువ్వుల లడ్డూలు కూడా ఒకటి. అయితే వీటి రుచి కారణంగా ఈ లడ్డూలను తినేందుకు ఎవరూ ఇష్టపడరు. కానీ నువ్వులతో లడ్డూలను తయారు చేసి రోజుకు ఒకటి చొప్పున తింటే చాలు.. ఎన్నో లాభాలను పొందవచ్చు. నువ్వుల లడ్డూలను రోజుకు ఒకటి తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

నువ్వుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందువల్ల రోజుకు ఒక లడ్డూను తింటే మన ఎముకలు బలంగా మారుతాయి. విరిగిన ఎముకలు అతుక్కుంటున్న వారు ఈ లడ్డూలను తింటుంటే త్వరగా కోలుకుంటారు. చిన్నారులు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు తింటే బిడ్డకు కూడా ఎంతో పోషణ లభిస్తుంది. ఇక ఈ లడ్డూల్లో ఐరన్‌ కూడా ఎక్కువే. ఇది రక్తహీనత నుంచి బయట పడేస్తుంది. అందువల్ల రక్తహీనత ఉన్నవారికి ఈ లడ్డూలు ఎంతో మేలు చేస్తాయి.

Sesame Laddu take daily one for these benefits
Sesame Laddu

ఒక్క నువ్వుల లడ్డూలో దాదాపుగా 62 క్యాలరీలు ఉంటాయి. అందువల్ల ఈ లడ్డూలను తింటే బరువు పెరుగుతామన్న భయం కూడా అవసరం లేదు. పైగా ఎన్నో పోషకాలు లభిస్తాయి. అవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ లడ్డూను తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్‌ మొత్తం కరిగిపోతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్‌ ఎటాక్ లు రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే షుగర్‌ లెవల్స్‌ నియంత్రణలోకి వస్తాయి.

ఉదయం అల్పాహారం చేసిన అనంతరం దీన్ని ఒక్క లడ్డూను తింటే చాలు.. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేస్తారు. నీరసం, అలసట అనేవి ఉండదు. ఉదయం నుంచే బద్దకంగా, నీరసంగా ఉందని భావించేవారు ఈ లడ్డూను తింటే చాలు.. ఎంతో శక్తి లభిస్తుంది. దీంతో ఉత్సాహంగా మారుతారు. ఈ లడ్డూల్లో పాలిఅన్‌శాచురేటెడ్‌ కొవ్వులు ఉంటాయి. ఇవి బీపీని నియంత్రించేందుకు సహాయ పడతాయి. అందువల్ల ఈ లడ్డూలను తింటే హైబీపీ తగ్గుతుంది. అలాగే ఒత్తిడి మటుమాయం అవుతుంది. జీర్ణ సమస్యలు ఉండవు. ముఖ్యంగా మలబద్దకం తగ్గుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కాంతివంతంగా మారి మెరుస్తుంది. ఇలా నువ్వుల లడ్డూలు రోజుకు ఒకటి తినడం ద్వారా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment