Seema Chinthakaya : ఈ సీజ‌న్‌లో ల‌భించే వీటిని అస‌లు మిస్ చేసుకోకండి..!

May 23, 2023 8:45 PM

Seema Chinthakaya : సీమ చింతకాయ.. పల్లెటూరి వారందరికీ దీని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. పట్టణాలలో కూడా ఈ మధ్య ఇవి బాగా ప్రాచుర్యం పొందాయి. సీమ చింతకాయల‌లో గులాబీ, ఎరుపు, తెలుపు రంగులో ఉండే పదార్థం తీపి, వగరు కలగలిపిన రుచిలో ఉంటుంది. జిలేబీ ఆకారంలో చుట్టలుగా ఉండే ఈ కాయలను జంగిల్ జిలేబి అని కూడా అంటారు. సీమ చింతకాయలలో పోషకాలు మెండుగా ఉంటాయి. వీటిని తింటే మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

సీమ చింతకాయలలో పీచు పదార్థాలు ఎక్కువగా కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ, బి, సి , డి తోపాటు ఖనిజ లవణాలు కూడా మెండుగా ఉంటాయి. ఇంకా కాపర్, ఐరన్, మెగ్నిషియం, పొటాషియం, పాస్ఫరస్, సొల్యూబుల్ ఫైబర్, సాచురేటెడ్ ఫ్యాట్ కలిగి ఉంటాయి. సీమ చింతకాయలలో ఉండే విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. శరీరం అనేక రకాల వైరస్ ల బారిన పడకుండా రక్షిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి వృద్ధాప్య ఛాయలను తొలగించడానికి అద్భుతంగా సహాయపడ‌తాయి. అలాగే ముఖంపై ముడతలు తగ్గి చర్మం తాజాగా ఉండేలా చేస్తాయి.

Seema Chinthakaya benefits must take them
Seema Chinthakaya

సీమ చింత కాయలను సాధారణ మహిళల కంటే గర్భిణీ స్త్రీలు తింటే చాలా మంచిది. ఎందుకంటే ఇందులో క్యాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వలన శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. నీరసం తగ్గుతుంది. ఈ కాయలలో క్యాల్షియం అధికంగా ఉండటం వలన తల్లితోపాటు పుట్టబోయే బిడ్డకు కూడా ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఇందులో ఉండే ఫైబర్ గర్భిణీ స్త్రీలలో మలబద్ధకాన్ని నివారిస్తుంది.

సీమ చింతకాయల‌లో ప్రోటీన్, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. వీటిని తినటం వలన త్వరగా ఆకలి వేయదు. పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. త్వరగా ఆకలి వేయదు. దాంతో చిరుతిళ్ళ జోలికి వెళ్లరు. బరువు తగ్గాలనుకునే వారికి చక్కని పోషకాహారంగా సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. సీమ చింతకాయలలో అమైనో ఆసిడ్ డోపమైన్ ఉంటుంది. దీని వలన ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ కాయల‌లో సోల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను నియంత్రణలో ఉంచుతుంది. అధిక రక్తపోటును తగ్గిస్తుంది. ఇంకా శరీరంలో నిల్వ ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. రక్తనాళాలు సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. దీంతో హార్ట్ ఎటాక్‌లు రావు. క‌నుక ఈ సీజ‌న్‌లో ల‌భించే ఈ కాయ‌ల‌ను అస‌లు మిస్ చేసుకోకండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment