Rainy Season : వానా కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వానా కాలంలో అనారోగ్య సమస్యలు ఏమీ లేకుండా ఉండాలంటే, ఆరోగ్యం పట్ల కచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. వానా కాలంలో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి పోషకాహారాన్ని తీసుకోవాలి. మంచి పోషకాహారాన్ని మీరు కనుక తీసుకున్నట్లయితే, వానా కాలంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు. అయితే వానా కాలంలో ఆకుకూరలకి దూరంగా ఉండాలి.
వానాకాలంలో ఆకుకూరలను తీసుకోవడం వలన అనేక రకాల సమస్యలకి మీరు గురయ్యే అవకాశం ఉంటుంది. వానా కాలంలో వీలైనంత వరకు ఆకుకూరలకి దూరంగా ఉండాలి. ఆకుకూరలపై బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న పురుగులు నీటి ద్వారా ఈ ఆకుకూరలని వ్యాపించి ఆ ఆకుల చివర్లలో గుడ్లని పెడుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో ఆకుకూరలని తీసుకుంటే ఇన్ఫెక్షన్లు వస్తాయి.
వానా కాలంలో చేపలు, రొయ్యలు వంటి సముద్ర ఆహారాలని కూడా తీసుకోకూడదు. ఇవి కూడా అనారోగ్య సమస్యల్ని కలిగిస్తాయి. వానా కాలంలో నీటిలో వ్యాధికారిక బ్యాక్టీరియా చేపలకి సోకవచ్చు. చేపల సంతాన ఉత్పత్తి కాలంలో సీ ఫుడ్ లో ఎన్నో మార్పులకి కారణం అవుతుంది. ఆరోగ్యానికి ఇది హాని కలగొచ్చు.
అదే విధంగా వానాకాలంలో పకోడీలు, సమోసాలు లాంటి వేయించిన ఆహార పదార్థాలను తీసుకుంటే అజీర్తి వంటి సమస్యలు కలుగుతాయి. కాబట్టి అలాంటి ఆహార పదార్థాలను కూడా తీసుకోవద్దు. వానా కాలంలో చల్లగా వాతావరణం ఉందని, చాలామంది నీళ్లు తీసుకోరు కానీ నీళ్లు తీసుకోకపోవడం వలన డీహైడ్రేషన్ కలగొచ్చు. కాబట్టి నీళ్లను తీసుకోండి.
కూల్ డ్రింక్స్ వంటి వాటిని అసలు వానాకాలంలో తీసుకోవద్దు. పుట్టగొడుగులని కూడా తీసుకోవద్దు. తడి నేలలో ఇవి పెరుగుతాయి. బ్యాక్టీరియా పెరుగుదలని కలిగి ఉంటాయి. కనుక వానా కాలంలో పుట్టగొడుగులను తీసుకుంటే కూడా సమస్యలు కలుగుతాయి. పచ్చి ఆహారాన్ని తీసుకుంటే, వ్యాధికారిక క్రిములు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. వానా కాలంలో పెరుగు తినడం వలన ఆహారంలో చల్లని స్వభావం వలన శరీరానికి హాని కలగొచ్చు. కాబట్టి ఈ పొరపాట్లు చేయొద్దు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…