Rainy Season : వ‌ర్షాకాలంలో ఈ ఆహారాల‌ను అస‌లు తీసుకోవ‌ద్దు..!

August 6, 2023 4:13 PM

Rainy Season : వానా కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వానా కాలంలో అనారోగ్య సమస్యలు ఏమీ లేకుండా ఉండాలంటే, ఆరోగ్యం పట్ల క‌చ్చితంగా శ్రద్ధ పెట్టాలి. వానా కాలంలో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి పోషకాహారాన్ని తీసుకోవాలి. మంచి పోషకాహారాన్ని మీరు కనుక తీసుకున్నట్లయితే, వానా కాలంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు. అయితే వానా కాలంలో ఆకుకూరలకి దూరంగా ఉండాలి.

వానాకాలంలో ఆకుకూరలను తీసుకోవడం వలన అనేక రకాల సమస్యలకి మీరు గురయ్యే అవకాశం ఉంటుంది. వానా కాలంలో వీలైనంత వరకు ఆకుకూరలకి దూరంగా ఉండాలి. ఆకుకూరలపై బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న పురుగులు నీటి ద్వారా ఈ ఆకుకూరలని వ్యాపించి ఆ ఆకుల చివర్లలో గుడ్లని పెడుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో ఆకుకూరలని తీసుకుంటే ఇన్ఫెక్షన్లు వస్తాయి.

Rainy Season do not take these foods
Rainy Season

వానా కాలంలో చేపలు, రొయ్యలు వంటి సముద్ర ఆహారాలని కూడా తీసుకోకూడదు. ఇవి కూడా అనారోగ్య సమస్యల్ని కలిగిస్తాయి. వానా కాలంలో నీటిలో వ్యాధికారిక బ్యాక్టీరియా చేపలకి సోకవచ్చు. చేపల సంతాన ఉత్పత్తి కాలంలో సీ ఫుడ్ లో ఎన్నో మార్పులకి కారణం అవుతుంది. ఆరోగ్యానికి ఇది హాని కలగొచ్చు.

అదే విధంగా వానాకాలంలో పకోడీలు, సమోసాలు లాంటి వేయించిన ఆహార పదార్థాలను తీసుకుంటే అజీర్తి వంటి సమస్యలు కలుగుతాయి. కాబట్టి అలాంటి ఆహార పదార్థాలను కూడా తీసుకోవద్దు. వానా కాలంలో చల్లగా వాతావరణం ఉందని, చాలామంది నీళ్లు తీసుకోరు కానీ నీళ్లు తీసుకోకపోవడం వలన డీహైడ్రేషన్ కలగొచ్చు. కాబట్టి నీళ్లను తీసుకోండి.

కూల్ డ్రింక్స్ వంటి వాటిని అసలు వానాకాలంలో తీసుకోవద్దు. పుట్టగొడుగులని కూడా తీసుకోవద్దు. తడి నేలలో ఇవి పెరుగుతాయి. బ్యాక్టీరియా పెరుగుదలని కలిగి ఉంటాయి. క‌నుక‌ వానా కాలంలో పుట్టగొడుగులను తీసుకుంటే కూడా సమస్యలు కలుగుతాయి. పచ్చి ఆహారాన్ని తీసుకుంటే, వ్యాధికారిక క్రిములు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. వానా కాలంలో పెరుగు తినడం వలన ఆహారంలో చల్లని స్వభావం వలన శరీరానికి హాని కలగొచ్చు. కాబట్టి ఈ పొరపాట్లు చేయొద్దు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now