Lakshmi Devi : శుక్రవారం నాడు మనం ఇలా చేయడం వలన, మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండాలని అనుకుంటారు. ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలని అనుకుంటారు. శుక్రవారం నాడు ఇలా చేసారంటే, కచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. మరి శుక్రవారం నాడు ఏం చేయాలి..? ఏం చేయకూడదు..? అనే విషయాలను ఇప్పుడు చూసేద్దాం.
శుక్రవారం నాడు ఉప్పుని తెచ్చుకున్నట్లైతే, లక్ష్మీ దేవిని మీ ఇంటికి తెచ్చుకున్నట్లే. అదే విధంగా ఒక్కొక్క సారి మనం పాలని కాచినప్పుడు అవి పొంగిపోతూ ఉంటాయి. అలా పొంగితే కూడా అది శుభమే. అయితే పాలు మాత్రం వృధాగా నేల మీద పడిపోతే అది అశుభం. పాలు చెడిపోతే వాటిని వెంటనే పారబోయాలి. అలా చెడిపోయిన పాలని ఇంట్లో పెట్టుకోవడం వలన లక్ష్మీదేవి ఆ ఇంట ఉండదు.
ఎప్పుడు కూడా పాలని ఒక శుభ్రమైన గిన్నెలో మాత్రమే పోసుకోవాలి. పాలని శుభ్రంగా లేని గిన్నెలో పోస్తే, లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి దూరం అయిపోతుంది. అప్పుల బాధలు పెరుగుతాయి. శుక్రవారం నాడు ఎవరికైనా అప్పు ఇస్తే, లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగి, వారి ఇంటి నుండి బయటకి వచ్చేస్తుంది. స్త్రీలు శుక్రవారం నాడు తలంటు స్నానం చేసి, లక్ష్మీదేవిని తప్పకుండా పూజించాలి.
శుక్రవారం మీ ఇంటికి ఎవరైనా ముత్తయిదువు వస్తే, వారికి దక్షిణతో కూడిన తాంబూలం ఇస్తే లక్ష్మీదేవి ఉంటుంది. సూర్యోదయానికి ముందే మహిళలు నిద్రలేచి, ఇంటిని శుభ్రం చేసుకుని, ముగ్గు వేసి, పూజ చేసుకుంటే ఆ ఇంట లక్ష్మీదేవి ఉంటుంది. ఇలా లక్ష్మీదేవి ఉండాలంటే ఈ విధంగా శుక్రవారం నాడు పాటించండి. అప్పుడు కచ్చితంగా మీ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఎలాంటి ఆర్థిక బాధలు కూడా ఉండవు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…