Lakshmi Devi : శుక్రవారం నాడు ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది..!

August 6, 2023 8:18 PM

Lakshmi Devi : శుక్రవారం నాడు మనం ఇలా చేయడం వలన, మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఏమీ లేకుండా ఉండాలని అనుకుంటారు. ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలని అనుకుంటారు. శుక్రవారం నాడు ఇలా చేసారంటే, కచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. మరి శుక్రవారం నాడు ఏం చేయాలి..? ఏం చేయకూడదు..? అనే విషయాలను ఇప్పుడు చూసేద్దాం.

శుక్రవారం నాడు ఉప్పుని తెచ్చుకున్నట్లైతే, లక్ష్మీ దేవిని మీ ఇంటికి తెచ్చుకున్నట్లే. అదే విధంగా ఒక్కొక్క సారి మనం పాలని కాచినప్పుడు అవి పొంగిపోతూ ఉంటాయి. అలా పొంగితే కూడా అది శుభమే. అయితే పాలు మాత్రం వృధాగా నేల మీద పడిపోతే అది అశుభం. పాలు చెడిపోతే వాటిని వెంటనే పారబోయాలి. అలా చెడిపోయిన పాల‌ని ఇంట్లో పెట్టుకోవడం వలన లక్ష్మీదేవి ఆ ఇంట ఉండదు.

do these works on friday to keep Lakshmi Devi in your home
Lakshmi Devi

ఎప్పుడు కూడా పాలని ఒక శుభ్రమైన గిన్నెలో మాత్రమే పోసుకోవాలి. పాలని శుభ్రంగా లేని గిన్నెలో పోస్తే, లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి దూరం అయిపోతుంది. అప్పుల బాధలు పెరుగుతాయి. శుక్రవారం నాడు ఎవరికైనా అప్పు ఇస్తే, లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగి, వారి ఇంటి నుండి బయటకి వచ్చేస్తుంది. స్త్రీలు శుక్రవారం నాడు తలంటు స్నానం చేసి, లక్ష్మీదేవిని తప్పకుండా పూజించాలి.

శుక్రవారం మీ ఇంటికి ఎవరైనా ముత్తయిదువు వస్తే, వారికి దక్షిణతో కూడిన తాంబూలం ఇస్తే లక్ష్మీదేవి ఉంటుంది. సూర్యోదయానికి ముందే మహిళలు నిద్రలేచి, ఇంటిని శుభ్రం చేసుకుని, ముగ్గు వేసి, పూజ చేసుకుంటే ఆ ఇంట లక్ష్మీదేవి ఉంటుంది. ఇలా లక్ష్మీదేవి ఉండాలంటే ఈ విధంగా శుక్రవారం నాడు పాటించండి. అప్పుడు కచ్చితంగా మీ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఎలాంటి ఆర్థిక బాధలు కూడా ఉండవు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment