Curries : మిగిలిపోయిన ఆహార పదార్థాలను చాలా మంది పారేయకూడదని, అనవసరంగా వృథా అవుతుందని, దాచుకొని మళ్ళీ తింటూ ఉంటారు. చాలామంది ఇళ్లల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మీ ఇంట్లో కూడా ఇలానే జరుగుతూ ఉంటుందా..? అయితే కచ్చితంగా ఈ విషయాలని మీరు తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి మనం ఎక్కువ వండుకోవడం, లేదంటే తక్కువ తినడం వలన కూరలు మిగిలిపోతూ ఉంటాయి. అంత రేటు పెట్టి కొన్నాము.. అంత కష్టపడి వంట చేసుకున్నాం.. రుచి బాగుంది కదా అని చాలామంది ఫ్రిజ్‌లో పెట్టుకుని మరుసటి రోజు తింటూ ఉంటారు.
అయితే అటువంటి వాళ్ళు కచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే భర్తల కోసం అని లేదంటే సమయం లేదని ఒకే సారి ఎక్కువ కూరలు చేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుని తింటుంటారు. వాటిని టైం చూసుకుని వేడి చేసుకుని తింటూ ఉంటారు. ఆహార పదార్థాలని అలా వదిలేయడం వలన గాలిలో ఉండే క్రిములు వాటిని పట్టుకుంటూ ఉంటాయి.
ఇలా నెమ్మదిగా ఆహారం పాడైపోతుంది. క్రిములు ఆహార పదార్థాలలోకి వెళ్లి ఆహార పదార్థాలని పాడుచేస్తూ ఉంటాయి. దాంతో కూర వాసన రావడం లేదంటే పాడైపోవడం వంటివి కనపడుతుంటాయి. ప్రతి గంటకి కూడా ఏదో ఒక మార్పు అందులో ఉంటుంది. అయితే,ఆహార పదార్ధం పాడైందని మనం కేవలం రుచి వాసన బట్టి మాత్రమే చెప్పగలము. కొంతమంది ఏం చేస్తారంటే ఆహార పదార్థాలు బయట ఉంటే పాడైపోతాయని కూరల్ని ఫ్రిజ్‌లో పెట్టుకుంటూ ఉంటారు.
ఫ్రిజ్‌లో పెట్టుకుని కూరలు తీసుకోవడం వలన ఎలాంటి జబ్బులు కూడా రావు. కానీ చాలామంది అలా తినరు. ఫ్రెష్ గా వేడివేడిగా తినేవాళ్లు ఒక్కసారిగా ఇలా దాచుకుని కూరలు తినడం వలన శరీరానికి అలవాటు లేకపోవడంతో ఇబ్బందులు రావచ్చు. వారి యొక్క పేగులకి అలవాటు లేదు కాబట్టి ఎఫెక్ట్ అవుతుంది. ఇన్ఫెక్షన్స్ వంటివి రావచ్చు. అదే రెగ్యులర్ గా ఇలా దాచుకుని తినే వాళ్ళు తింటే శరీరానికి అలవాటు పడి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలగవు. పోషకాలు మాత్రం తగ్గిపోతాయి చూసుకోండి.
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్ర షూటింగ్‌ను ప్రస్తుతం జూనియర్ ఎన్‌టీఆర్…
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది మూవీ విడుదల మరోసారి వాయిదా పడింది. మూవీ అనుకున్న తేదీ ప్రకారమే రిలీజ్…
తాను సినిమాల్లో నటించిన సమయంలో తన దుస్తులను తానే డిజైన్ చేసుకుని ధరించే దాన్నని నటి రేణు దేశాయ్ తెలిపారు.…
మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేనని నిర్మాత సుప్రియ యార్లగడ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీలకమని, ఇప్పుడు ప్రేక్షకులు…
నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…
పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈ…