Curries : మిగిలిన కూర‌ల‌ను దాచుకుని మ‌రీ తింటున్నారా.. అయితే ఇది చూడండి..!

August 16, 2023 9:47 PM

Curries : మిగిలిపోయిన ఆహార పదార్థాలను చాలా మంది పారేయకూడదని, అనవసరంగా వృథా అవుతుందని, దాచుకొని మళ్ళీ తింటూ ఉంటారు. చాలామంది ఇళ్లల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మీ ఇంట్లో కూడా ఇలానే జరుగుతూ ఉంటుందా..? అయితే కచ్చితంగా ఈ విషయాలని మీరు తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి మనం ఎక్కువ వండుకోవడం, లేదంటే తక్కువ తినడం వలన కూరలు మిగిలిపోతూ ఉంటాయి. అంత రేటు పెట్టి కొన్నాము.. అంత కష్టపడి వంట చేసుకున్నాం.. రుచి బాగుంది కదా అని చాలామంది ఫ్రిజ్‌లో పెట్టుకుని మరుసటి రోజు తింటూ ఉంటారు.

అయితే అటువంటి వాళ్ళు కచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే భర్తల కోసం అని లేదంటే సమయం లేదని ఒకే సారి ఎక్కువ కూరలు చేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుని తింటుంటారు. వాటిని టైం చూసుకుని వేడి చేసుకుని తింటూ ఉంటారు. ఆహార పదార్థాలని అలా వదిలేయడం వలన గాలిలో ఉండే క్రిములు వాటిని పట్టుకుంటూ ఉంటాయి.

if you are taking left over Curries then take a look
Curries

ఇలా నెమ్మదిగా ఆహారం పాడైపోతుంది. క్రిములు ఆహార పదార్థాలలోకి వెళ్లి ఆహార పదార్థాలని పాడుచేస్తూ ఉంటాయి. దాంతో కూర వాసన రావడం లేదంటే పాడైపోవడం వంటివి కనపడుతుంటాయి. ప్రతి గంటకి కూడా ఏదో ఒక మార్పు అందులో ఉంటుంది. అయితే,ఆహార పదార్ధం పాడైందని మనం కేవలం రుచి వాసన బట్టి మాత్రమే చెప్పగలము. కొంతమంది ఏం చేస్తారంటే ఆహార పదార్థాలు బయట ఉంటే పాడైపోతాయని కూరల్ని ఫ్రిజ్‌లో పెట్టుకుంటూ ఉంటారు.

ఫ్రిజ్‌లో పెట్టుకుని కూరలు తీసుకోవడం వలన ఎలాంటి జబ్బులు కూడా రావు. కానీ చాలామంది అలా తినరు. ఫ్రెష్ గా వేడివేడిగా తినేవాళ్లు ఒక్కసారిగా ఇలా దాచుకుని కూరలు తినడం వలన శరీరానికి అలవాటు లేకపోవడంతో ఇబ్బందులు రావచ్చు. వారి యొక్క పేగులకి అలవాటు లేదు కాబట్టి ఎఫెక్ట్ అవుతుంది. ఇన్ఫెక్షన్స్ వంటివి రావచ్చు. అదే రెగ్యులర్ గా ఇలా దాచుకుని తినే వాళ్ళు తింటే శరీరానికి అలవాటు పడి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలగవు. పోషకాలు మాత్రం తగ్గిపోతాయి చూసుకోండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment