Hair Growth : వారంలో రెండు సార్లు ఇలా చేస్తే చాలు.. జుట్టు వ‌ద్ద‌న్నా పెరుగుతూనే ఉంటుంది..!

August 1, 2023 3:16 PM

Hair Growth : ఈరోజుల్లో చాలా మంది జుట్టు రాలిపోవడం వలన అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. సరైన ఆహారం తీసుకోకపోవడం, కాలుష్యం, పోషకాహార లోపం, ఒత్తిడి మొదలైన కారణాల వలన జుట్టు బాగా రాలుతోంది. జుట్టు రాలిపోవడం వలన రకరకాల పద్ధతుల్ని చాలా మంది పాటిస్తున్నారు. మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ ని కూడా కొనుగోలు చేసి, వాడుతున్నారు. కొందరికి బట్టతల కూడా వచ్చేస్తోంది. జుట్టు రాలిపోవడం, జుట్టు పలుచ‌గా అయిపోవడం వంటి సమస్యల నుండి బయట పడాలన్నా.. చుండ్రు, దురద, ఇన్ఫెక్షన్స్ వంటివి లేకుండా ఉండాలన్నా మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ ని మాత్రమే కాదు. మనం ఇంటి చిట్కాలను కూడా ట్రై చేయొచ్చు.

మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ లో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. వాటి వలన ఉపయోగం కంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ విధంగా మీరు పాటించారంటే, జుట్టు వారం రోజులలో ఆగకుండా పెరుగుతుంది. జుట్టు త్వరగా పెరగాలంటే, ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకుని తొక్క తీసేసి, శుభ్రంగా కడిగి తురుముకోవాలి. మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ అయినా చేయొచ్చు.

Hair Growth tips in telugu do like this
Hair Growth

తర్వాత అల్లం ముక్కల్ని తీసుకుని శుభ్రంగా కడిగి తురుముకోవాలి. లేదంటే పేస్ట్ చేసుకోవాలి. అల్లం, ఉల్లిపాయ పేస్ట్ ని కాటన్ క్లాత్ తో వడకట్టుకోండి. తర్వాత ఒక చెంచా న‌ల్ల‌ ఆముదం నూనె వేసుకోవాలి. అది లేకపోతే సాధార‌ణ‌ ఆముదాన్ని కూడా వేసుకోవచ్చు. లేదంటే రెండు విటమిన్ ఈ క్యాప్సుల్స్ ని వేసుకోవచ్చు.

లేకపోతే ఒక చెంచా బాదం నూనె వేసుకున్నా సరే ఫ‌రవాలేదు. వీటిని బాగా మిక్స్ చేసుకుని అప్లై చేసుకోవాలి. అయితే కేవలం మాడుకి అప్లై చేస్తే సరిపోతుంది. కురులకి అప్లై చేయక్కర్లేదు. ఒక గంట సేపు అలా ఉండనిచ్చి తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. తల వెంట్రుకలు నల్లగా మారిపోతాయి. జుట్టు బాగా ఎదుగుతుంది. జుట్టు సమస్యల నుండి దూరంగా ఉండొచ్చు. అందమైన కురులని సొంతం చేసుకోవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment