Gangavalli Kura : మార్కెట్‌లో మనకు ఎన్నో రకాల ఆకుకూరలు లభ్యమవుతుంటాయి. వాటిల్లో గంగవాయల ఆకు కూడా ఒకటి. దీన్నే గంగవల్లి అని, గంగపాయ అని, గోళీ కూర అని కూడా పిలుస్తారు. ఇది కాస్త పుల్లగా ఉంటుంది. దీన్ని పప్పు లేదా కూర రూపంలో చేసి తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. మనకు ఈ మొక్క ఎక్కువగా పల్లెటూళ్లలో, పొలాల గట్ల మీద ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఇది నెల మీద పాకుతుంది. ఆకులు చాలా దళసరిగా ఉండి పసుపు పచ్చని పూలు పూస్తాయి. పుల్లగా ఉండే ఈ కూరతో కూర, పప్పు చేసుకుంటారు. గంగవాయల కూర చాలా సులభంగా పెరుగుతుంది. పెద్దగా సంరక్షణ చేయవలసిన అవసరం లేదు. ఈ ఆకులో చాలా పోషకాలు ఉంటాయి. ఈ పోషకాల గురించి తెలుసుకుంటే ఈ కూరను చాలా ఇష్టంగా తింటారు.
ఒకవేళ తినని వారు ఉంటే ఇప్పుడు చెప్పే ప్రయోజనాలు తెలుసుకొంటే తప్పనిసరిగా తినటం అలవాటు చేసుకుంటారు. గంగవాయల ఆకులో విటమిన్ A, B, C లతో పాటు కాల్షియం, పొటాషియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. గంగవాయల కూరలో తక్కువ కేలరీలు, ఎక్కువ పీచు పదార్ధం ఉండడం వల్ల బరువు తగ్గాలని అనుకునే వారికి మంచి కూర అని చెప్పవచ్చు. గంగవాయల కూరలో పీచు సమృద్ధిగా ఉంటుంది. దీనివల్ల జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి. మలబద్దకం వంటి సమస్యలు తొలగిపోతాయి. గంగవాయల ఆకులను తినడం వల్ల మన శరీరంలో LDL అంటే చెడు కొలెస్ట్రాల్ ను నాశనం చేస్తుంది.
రక్త ప్రహవానికి అడ్డు వచ్చే కొలెస్ట్రాల్ లేకపోవటం వలన గుండెకు మేలు జరుగుతుంది. అలాగే రక్తపోటు సమస్యను కూడా తగ్గిస్తుంది. ఒమెగా 3 ఫాటీ ఆమ్లాలు గంగవాయల కూరలో ఉన్నంత విధంగా ఏ ఆకుకూరలోనూ ఉండవు. ఇందులో ఐరన్, కాపర్ సమృద్ధిగా ఉండడం వల్ల రక్తంలో రక్త కణాల సంఖ్యను పెంచడంలో సహాయపడతాయి. రక్తహీనత సమస్య ఉన్నవారు తరచూ ఈ కూరను తింటే ఆ సమస్య నుండి బయట పడవచ్చు. అన్ని ఆకుకూరల్లో కన్నా ఈ గంగవాయల ఆకుల్లోనే విటమిన్ ఎ ఎక్కువగా ఉండడం వల్ల కంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. అంతేకాక చర్మంపై ఏర్పడే ముడతలు, నల్లని మచ్చలు, చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించి కొత్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది.
గంగవాయల ఆకులలో జింక్ అధికంగా ఉండడం వలన ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం చేస్తుంది. ఇందులో కాల్షియం, పొటాషియం అధికంగా ఉండడం వల్ల ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తుంది. నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఈ కూరలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. దీని వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడానికి అవసరమైన అన్ని పోషకాలు గంగవాయల ఆకుకూరలో ఉంటాయి. అందువల్ల ఈ ఆకుకూరను తరచూ తింటుంటే ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…