సినిమా రంగంలో ఎన్టీఆర్ తో ఎన్నో సినిమాల్లో సూపర్ స్టార్ కృష్ణ పోటీపడినప్పటికీ రాజకీయ రంగంలోకి మాత్రం కృష్ణ మొదట్లో రాలేదు. నిజానికి కృష్ణ తీసిన 200వ చిత్రం ఈనాడు సినిమా ఎన్టీఆర్ తెలుగుదేశం విజయానికి పరోక్షంగా దోహదం చేసింది. ఎన్టీఆర్ గెలిచాక ఈనాడు 100 రోజుల సందర్బంగా ఎన్టీఆర్ కి అభినందనలు తెల్పుతూ కృష్ణ ప్రకటన కూడా ఇచ్చారు. అయితే 1984లో ఇందిరాగాంధీ మరణం తర్వాత రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి రావడం, ప్రధాని కావడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ని అధికారంలో తేవడానికి కసరత్తు కూడా జోరందుకుంది.
ఆ సమయంలో కృష్ణను రాజకీయాల్లోకి రావాలని రాజీవ్ గాంధీ స్వయంగా ఆహ్వానించడంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన కృష్ణను ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా, ముఖ్యంగా ఎన్టీఆర్ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సినిమాలు తీయాలని కాంగ్రెస్ నాయకత్వం సూచించింది. దాంతో కృష్ణ డైరెక్షన్ లో వచ్చిన తొలి మూవీ సింహాసనంలో రాజగురువు సత్యనారాయణ చేత ఓ డైలాగ్ చెప్పించారు. అది గతంలో ఎన్టీఆర్ ఓ సందర్భంలో మాట్లాడారు. నా దగ్గరేముంది బూడిద.. అనే డైలాగ్. ఆ తర్వాత నా పిలుపే ప్రభంజనం మూవీలో ఎన్టీఆర్ ను పోలిన పాత్రను సత్యనారాయణ పోషించారు. సినిమా లో కొన్ని డైలాగులు దాసరి నారాయణరావుతో రాయించారు. సినిమా హాల్స్ దగ్గర ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తే సినిమాకు ఇంకా పబ్లిసిటీ వస్తుందని ఊహించారు. కానీ ఎవరినీ ఆందోళన చేయొద్దని ఎన్టీఆర్ ఆదేశించారు.
ఇక దాని తర్వాత ప్రభాకర రెడ్డి డైరెక్షన్ లో మండలాధీశుడు మూవీని కృష్ణ తీశారు. ఎన్టీఆర్ ను పోలిన పాత్రను కోట శ్రీనివాసరావు వేయగా, సీనియర్ నటి భానుమతి ఇందులో నటించడం కూడా పెద్ద సంచలనంగా మారింది. ఈ మూవీ మొదట్లో కృష్ణ కనిపిస్తారు. అయితే కోటకు రెండేళ్లపాటు ఎవరూ సినిమాల్లో ఛాన్స్ లు ఇవ్వలేదు. ఇక సాహసమే నా ఊపిరి పేరిట మరో మూవీ కృష్ణ తీశారు. ఎన్నికల ముందు వచ్చిన ఈ మూవీని రాజీవ్ గాంధీకి చూపించారు. ఇక ప్రభాకర రెడ్డి డైరెక్షన్ లో గండిపేట రహస్యం పేరిట మరో సెటైరికల్ మూవీ వచ్చింది. అలాగే ఎన్టీఆర్ విశ్వామిత్ర సినిమా తీస్తున్న సమయంలో.. కలియుగ విశ్వామిత్ర మూవీని విజయ చందర్ డైరెక్షన్ లో కృష్ణ బావమరిది యు.సూర్యనారాయణ బాబు నిర్మించారు. ఇలా ఎన్‌టీఆర్‌కు వ్యతిరేకంగా అప్పట్లో కృష్ణ తీసిన సినిమాలు సంచలనంగా మారాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…