Gangavalli Kura : ఈ ఆకు ఎక్క‌డ కనిపించినా స‌రే తెచ్చుకుని తినండి.. ఎందుకంటే..?

February 19, 2023 10:57 AM

Gangavalli Kura : మార్కెట్‌లో మ‌న‌కు ఎన్నో ర‌కాల ఆకుకూర‌లు ల‌భ్య‌మ‌వుతుంటాయి. వాటిల్లో గంగ‌వాయ‌ల ఆకు కూడా ఒక‌టి. దీన్నే గంగ‌వ‌ల్లి అని, గంగ‌పాయ అని, గోళీ కూర అని కూడా పిలుస్తారు. ఇది కాస్త పుల్ల‌గా ఉంటుంది. దీన్ని ప‌ప్పు లేదా కూర రూపంలో చేసి తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. మ‌న‌కు ఈ మొక్క ఎక్కువగా పల్లెటూళ్ల‌లో, పొలాల గట్ల మీద‌ ఎక్కువగా కనబ‌డుతూ ఉంటుంది. ఇది నెల మీద పాకుతుంది. ఆకులు చాలా దళసరిగా ఉండి పసుపు పచ్చని పూలు పూస్తాయి. పుల్లగా ఉండే ఈ కూరతో కూర, పప్పు చేసుకుంటారు. గంగవాయల కూర చాలా సులభంగా పెరుగుతుంది. పెద్దగా సంరక్షణ చేయవలసిన అవసరం లేదు. ఈ ఆకులో చాలా పోషకాలు ఉంటాయి. ఈ పోషకాల గురించి తెలుసుకుంటే ఈ కూరను చాలా ఇష్టంగా తింటారు.

ఒకవేళ తినని వారు ఉంటే ఇప్పుడు చెప్పే ప్రయోజనాలు తెలుసుకొంటే తప్పనిసరిగా తినటం అలవాటు చేసుకుంటారు. గంగవాయల ఆకులో విటమిన్ A, B, C లతో పాటు కాల్షియం, పొటాషియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. గంగవాయల కూరలో తక్కువ కేలరీలు, ఎక్కువ పీచు పదార్ధం ఉండడం వ‌ల్ల‌ బరువు తగ్గాలని అనుకునే వారికి మంచి కూర అని చెప్పవచ్చు. గంగవాయల కూరలో పీచు సమృద్ధిగా ఉంటుంది. దీనివ‌ల్ల‌ జీర్ణ సంబంధ సమస్యలు త‌గ్గుతాయి. మలబద్దకం వంటి సమస్యలు తొలగిపోతాయి. గంగవాయల ఆకుల‌ను తినడం వల్ల మన శరీరంలో LDL అంటే చెడు కొలెస్ట్రాల్ ను నాశనం చేస్తుంది.

Gangavalli Kura wonderful health benefits
Gangavalli Kura

రక్త ప్రహవానికి అడ్డు వచ్చే కొలెస్ట్రాల్ లేకపోవటం వలన గుండెకు మేలు జరుగుతుంది. అలాగే రక్తపోటు సమస్యను కూడా తగ్గిస్తుంది. ఒమెగా 3 ఫాటీ ఆమ్లాలు గంగవాయల కూరలో ఉన్నంత విధంగా ఏ ఆకుకూరలోనూ ఉండవు. ఇందులో ఐరన్, కాప‌ర్ సమృద్ధిగా ఉండ‌డం వల్ల‌ రక్తంలో రక్త కణాల సంఖ్యను పెంచడంలో సహాయపడతాయి. రక్తహీనత సమస్య ఉన్నవారు తరచూ ఈ కూరను తింటే ఆ సమస్య నుండి బయట పడవచ్చు. అన్ని ఆకుకూరల్లో కన్నా ఈ గంగవాయల ఆకుల్లోనే విటమిన్ ఎ ఎక్కువగా ఉండ‌డం వల్ల కంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. అంతేకాక చర్మంపై ఏర్పడే ముడతలు, నల్లని మచ్చలు, చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించి కొత్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది.

గంగవాయ‌ల ఆకుల‌లో జింక్ అధికంగా ఉండ‌డం వలన ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం చేస్తుంది. ఇందులో కాల్షియం, పొటాషియం అధికంగా ఉండడం వల్ల ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తుంది. నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఈ కూరలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. దీని వ‌ల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడానికి అవసరమైన అన్ని పోషకాలు గంగవాయల ఆకుకూరలో ఉంటాయి. అందువ‌ల్ల ఈ ఆకుకూర‌ను త‌ర‌చూ తింటుంటే ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now