Jathara Movie : మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. ఇక ఆయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అనేక విభిన్నమైన మూవీలను చేశారు. ముఖ్యంగా ప్రాణం ఖరీదు, పునాదిరాళ్ళు, మనవూరి పాండవులు వంటి సినిమాలతో ఆకట్టుకున్నారు. ఇక అప్పట్లోనే జాతర అనే సినిమాను 1979లో తీశారు. ధవళ సత్యం దీనికి డైరెక్టర్. ఈయనకు ఇది మొదటి సినిమా. నిజానికి నరసింహరాజు అప్పటికి చాలా సినిమాలతో ఆకట్టుకుంటుంటే అతడితోనే తీయొచ్చు కదా అని కొందరు సలహా ఇచ్చినా సరే చిరుతో జాతర తీశామని నిర్మాత రాజు చెప్పారు.
ఇప్పటికీ చిరంజీవి మెగాస్టార్ గా ఉన్నత స్థానంలో ఉన్నా సరే.. ఆప్యాయంగా పలకరిస్తుంటారని.. ఇది తమ భాగ్యంగా భావిస్తామని రాజు చెప్పారు. నేను పుట్టిన ఊళ్ళోనే తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లిలో 45 రోజులు షూటింగ్ చేశామని ఓ ఇంటర్యూలో నిర్మాత రాజు తెలిపారు. హీరో బ్రదర్ గా శ్రీధర్, విలన్ గా నాగభూషణం చేశారు. అందరూ కూడా సఖినేటిపల్లి వచ్చి షూటింగ్ లో పాల్గొన్నారు.
సినిమా ఆర్థికంగా లాభం తీసుకు రాకపోయినా మంచి పేరు తెచ్చింది. అందరూ జాతర రాజు గారు అని నిర్మాతను పిలిచేవారట. నరసాపురం వరకూ రైలులో వచ్చి అక్కడనుంచి పడవల మీద సఖినేటిపల్లి చేరుకొని బంధువుల ఇళ్లల్లోనే అందరినీ ఉంచి షూటింగ్ చేశారు. ఆ సినిమాకు చిరంజీవికి 10వేల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారు. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే ప్రివ్యూ చూసిన మాదాల రంగారావు.. నవతరం కదిలింది మూవీకి డైరెక్టర్ గా ధవళ సత్యంను కన్ఫర్మ్ చేసుకున్నారు. అయితే చిరంజీవి ఇప్పుడంటే కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు కానీ.. ఒకప్పుడు ఆయన ఎంత పారితోషికం తీసుకున్నారో తెలిస్తే.. ఎవరైనా సరే షాక్‌కు గురవుతారు.
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…