Clean Lungs : ఇలా చేస్తే మీ ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి తెలుసా..?

April 3, 2023 6:07 PM

Clean Lungs : ప్రస్తుతం గాలి కాలుష్యం ఏవిధంగా వాతావరణాన్ని ప్రభావితం చేస్తుందో అందరికీ తెలిసిందే. దీంతో వాతావరణానికే కాదు, మనకు కూడా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కేవలం గాలి కాలుష్యం వల్ల మాత్రమే కాకుండా, పొగ తాగడం, మద్యం సేవించడం, ఇతర దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల వల్ల కూడా ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి. ఫలితంగా అది క్యాన్సర్‌కు కూడా దారి తీస్తుంది. అయితే కింద చెప్పిన సూచనలు పాటిస్తే దాంతో ఊపిరితిత్తులను చాలా ఎఫెక్టివ్‌గా శుభ్రం చేసుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

క‌ఫం ఎక్కువ‌గా ఉన్న‌వారు పాలు, దాని సంబంధ ఉత్పత్తులైన పెరుగు, వెన్న, నెయ్యి, మజ్జిగ వంటి వాటిని తీసుకోకూడదు. వీటిల్లో ఉండే పలు రకాల పదార్థాల ఊపిరితిత్తులకు హాని చేస్తాయి. వీటిని ఆహారం నుంచి తొలగించడం మంచిది. రోజుకు 2 కప్పుల గ్రీన్ టీ తాగాలి. దీంతో ఊపిరితిత్తుల్లో ఉండే వ్యర్థాలు బయటికి వెళ్లిపోయి అవి శుభ్రంగా తయారవుతాయి. ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగాలి. దీంతో ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి. ఉదయాన్నే పరగడుపున, మధ్యాహ్నం భోజనానికి 30 నిమిషాల ముందు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను తాగాలి. ఇలా చేస్తే ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి.

follow these remedies to Clean Lungs
Clean Lungs

ఆరెంజ్, అరటిపండు, చిలగడదుంపలు, క్యారెట్లు తదితర పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తింటే ఊపిరితిత్తులు క్లీన్ అయి ఆరోగ్యంగా ఉంటాయి. ఉదయాన్నే పరగడుపున అల్లం రసం సేవిస్తే ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి. విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. ఉదయాన్నే పరగడుపున 4,5 పుదీనా ఆకులను అలాగే నమిలి మింగాలి. ఇలా చేస్తే ఊపిరితిత్తులు శుభ్రమవుతాయి. కొంత ఆముదం తీసుకుని ఉదయం, సాయంత్రం ఛాతిపై మర్దనా చేస్తూ రాయాలి. దీంతో ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి. ఈ సూచనల్లో కనీసం 4 సూచనలను 3 రోజుల పాటు పాటిస్తే చాలు, తేడా మీకే తెలుస్తుంది. అయితే ఈ సూచనలను పాటించాలనుకునే వారు పొగ తాగకూడదు, మద్యం సేవించకూడదు. దీంతో రిజ‌ల్ట్ చ‌క్క‌గా వ‌స్తుంది. క‌నుక ఊపిరితిత్తుల‌ను శుభ్రం చేసుకోవాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment