పసుపు పాలు తాగుతున్నారా? డాక్టర్ పాల్ మాణికం సీరియస్ హెచ్చరిక!

గట్ హెల్త్ నిపుణుడు డాక్టర్ పాల్ మాణికం తన భార్య విష్ణు ప్రియా రాఘవన్‌తో కలిసి చేసిన ఓ సరదా ఇన్‌స్టాగ్రామ్ స్కిట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోలో ఆయన పసుపు పానీయాల ప్రయోజనాలను విశ్లేషిస్తూ, పసుపు సప్లిమెంట్లపై మాత్రం స్పష్టమైన హెచ్చరిక చేశారు.

February 10, 2026 12:04 PM
Dr. Pal Manickam explaining turmeric milk benefits and supplement risks.
పసుపు పాలు మరియు సప్లిమెంట్లపై డాక్టర్ పాల్ మాణికం కీలక విశ్లేషణ. Photo Credit: Healthline/Pal Manickam/Instagram.

గట్ హెల్త్ నిపుణుడు డాక్టర్ పాల్ మాణికం తన భార్య విష్ణు ప్రియా రాఘవన్‌తో కలిసి చేసిన ఓ సరదా ఇన్‌స్టాగ్రామ్ స్కిట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోలో ఆయన పసుపు పానీయాల ప్రయోజనాలను విశ్లేషిస్తూ, పసుపు సప్లిమెంట్లపై మాత్రం స్పష్టమైన హెచ్చరిక చేశారు. భారతీయ సంప్రదాయంలో తరతరాలుగా ఉపయోగిస్తున్న పసుపు పాలు బ్యాక్టీరియా నిరోధక లక్షణాలు కలిగి ఉంటాయని, రోగనిరోధక శక్తిని పెంచుతాయని ఆయన అంగీకరించారు. అయితే రోజూ కనీసం 250 గ్రాముల ఫైబర్‌, తగిన ప్రోటీన్‌, ఏడు గంటల నిద్ర లేకపోతే పసుపు పాలు తీసుకున్నా పెద్దగా ఉపయోగపడవని స్పష్టం చేశారు. ఆరోగ్యానికి సమగ్ర జీవనశైలి తప్పనిసరి అని సూచించారు.

ప‌సుపు స‌ప్లిమెంట్లు వ‌ద్దు..

పసుపు సప్లిమెంట్లు తీసుకోవద్దని డాక్టర్ మాణికం హెచ్చరించారు. ఈ సప్లిమెంట్ల మార్కెట్‌కు సరైన నియంత్రణ లేదని, ఎక్కువ మోతాదులో టాబ్లెట్లు తీసుకుంటే కాలేయానికి తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉందని తెలిపారు. పసుపు పాలను గోల్డెన్ మిల్క్ అని కూడా పిలుస్తారు. దీన్ని శతాబ్దాలుగా సంప్రదాయ వైద్య విధానాల్లో ఉపయోగిస్తున్నారు. పసుపులో ఉండే కర్కుమిన్‌ అనే సమ్మేళనం వ‌ల్ల ప‌సుపుకు అంత‌టి ప్రాధాన్య‌త ఏర్ప‌డింది. వైద్య అధ్యయనాల ప్రకారం కర్కుమిన్‌లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని కణాలను నష్టపరిచే ఆక్సీక‌ర‌ణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీని వల్ల దీర్ఘకాలిక వ్యాధుల‌ ప్రమాదం తగ్గే అవకాశం అధికంగా ఉంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Dr. Pal Manickam (@dr.pal.manickam)

మెద‌డు ఆరోగ్యానికి..

మెదడు ఆరోగ్యానికి కూడా కర్కుమిన్ మేలు చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది మెదడులో కొత్త కణాల పెరుగుదలకు సహకరించే బీడీఎన్‌ఎఫ్‌ అనే ప్రోటీన్ స్థాయిని పెంచవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. బీడీఎన్‌ఎఫ్ తక్కువగా ఉంటే అల్జీమర్స్ వంటి నాడీ సంబంధ వ్యాధులు వ‌చ్చే అవ‌కాశాలు అధికంగా ఉంటాయి. ఇక గుండె ఆరోగ్యానికి కూడా పసుపు ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. రక్తనాళాల పనితీరును మెరుగుపరచడం ద్వారా రక్త ప్రసరణను మెరుగు ప‌రుస్తుంది. అలాగే జీర్ణక్రియను పెంపొందించ‌డంలోనూ పసుపు సహాయపడుతుంది. పిత్తరసం ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా కొవ్వు జీర్ణక్రియకు ప‌సుపు దోహదం చేస్తుంది.

అయితే పసుపు పాలు సంప్రదాయం ప్ర‌కారం ఆరోగ్య‌క‌ర‌మే అయిన‌ప్ప‌టికీ అవి ఆరోగ్యానికి మేలు చేయాలంటే సమతుల ఆహారం, సరైన నిద్ర, జీవనశైలి మార్పులు తప్పనిసరి అన్న విషయాన్ని డాక్టర్ మాణికం స్పష్టంగా చెప్పారు. క‌నుక కేవ‌లం ప‌సుపు పాల‌ను తీసుకుంటున్నాం, మాకేమీ కాదు, అన్న భావ‌న ప‌నికిరాదు. దానికి తోడు ఇత‌ర అన్ని విష‌యాల్లోనూ జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు.

గ‌మ‌నిక‌: ఈ క‌థ‌నం స‌మాచారం, వైద్య విజ్ఞానంపై అవ‌గాహ‌న కోసం మాత్ర‌మే. చికిత్స‌కు ప్ర‌త్యామ్నాయం కాదు. ఎవ‌రికైనా ఏదైనా స‌మ‌స్య ఉంటే లేదా స‌ల‌హా కావ‌ల్సి వ‌స్తే వైద్యుల‌ను సంప్ర‌దించాల్సి ఉంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment