Chicken Liver : చాలా మంది మాంసాహారాన్ని తీసుకుంటూ ఉంటారు. మాంసాహారంలో ఎన్నో రకాలు ఉన్నాయి. చికెన్ లివర్ ని కూడా చాలా మంది ఇష్ట పడుతుంటారు. చికెన్ లివర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చికెన్ లివర్ వలన కలిగే లాభాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. చికెన్ లివర్ ని తీసుకుంటే ఎన్నో రకాల సమస్యలు దూరం అవుతాయి. ఇక మరి ఇందులో వుండే పోషకాల గురించి, ఏయే సమస్యలు దూరం అవుతాయి అనేది చూసేద్దాం.
చికెన్ లివర్ లో సెలీనియం ఉంటుంది. అది గుండె జబ్బుల నుండి రక్షణని ఇస్తుంది. గుండె సమస్యల్ని దూరం చేస్తుంది. ఈరోజుల్లో గుండె సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయి. అలాంటి వాటి నుండి బయట పడాలంటే చికెన్ లివర్ ని తీసుకోవడం మంచిది. గుండె సమస్యలే వుండవు. లివర్ లో ఉండే ఫోలేట్ లైంగిక సామర్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగపడుతుంది. చికెన్ లివర్ ని తీసుకోవడం వలన కండరాలు బలంగా ఉంటాయి.
ఎముకలు కూడా బలంగా ఉంటాయి. చికెన్ లివర్ ని తీసుకోవడం వలన క్యాన్సర్ ప్రమాదం కూడా తగ్గుతుందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. చికెన్ లివర్ ని మోతాదుగా ఉడికించినట్లయితే తక్కువ క్యాలరీలు ఉంటాయి. చికెన్ లివర్ లో ఉండే పోషకాలు రక్తాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఇందులో ఉండే పోషకాలు బ్రెయిన్ పని తీరుని మెరుగుపరచడానికి కూడా ఉపయోగ పడతాయి. ఇందులో ఉండే విటమిన్ ఎ కంటి చూపుని మెరుగుపరుస్తుంది. పోషకాహార లోపంతో బాధపడే వాళ్ళు, చికెన్ లివర్ ని తీసుకుంటే ఆ సమస్య నుండి బయట పడడానికి అవుతుంది. ఇలా చికెన్ లివర్ ని తీసుకోవడం వలన ఎన్నో రకాల సమస్యల నుండి బయటపడడానికి అవుతుంది. ఆరోగ్యంగా ఉండొచ్చు. అనారోగ్య సమస్యలకి దూరంగా ఉండొచ్చు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…