సాధారణంగా ప్రతి రోజూ ఉదయం లేవగానే ప్రతి ఒక్కరు తీసుకొనే పానీయం ఏదైనా ఉందా అంటే అది కాఫీ, టీ అని చెప్పవచ్చు. ఈ ప్రపంచంలో నీటి తర్వాత అత్యధికంగా తాగే పానీయాలలో ఈ కాఫీ టీలు ముందు వరుసలో ఉన్నాయి.అయితే ప్రస్తుత కాలంలో కాఫీ టీలకు బదులుగా మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది గ్రీన్ టీ తాగడానికి అలవాటు పడుతున్నారు. అసలు గ్రీన్ టీ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి. గ్రీన్ టీ ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మనకు మార్కెట్లో గ్రీన్ టీ బ్యాగులు ఎంత విరివిగా లభిస్తాయి. బాగా వేడిగా ఉన్నటువంటి ఒక కప్పు నీటిలో కి రెండు నిమిషాల పాటు గ్రీన్ టీ బ్యాగ్ వేసిన తర్వాత మనకు కావలసి వస్తే ఇందులోకి మరికొన్ని ఫ్రెష్ హెర్బ్స్ లేదా నిమ్మరసం తేనె వంటి వాటిని కలుపుకుని తాగవచ్చు.ఈ విధంగా ప్రతి రోజుకు రెండు నుంచి మూడు కప్పుల వరకు గ్రీన్ టీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా గ్రీన్ టీలో సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి.
*ఈ సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు గ్రీన్ టీలో విరివిగా లభించడం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన ఫ్రీరాడికల్స్ ను బయటకు పంపడానికి దోహదపడతాయి.
*నిత్యం గ్రీన్ టీ తాగడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. తద్వారా జ్ఞాపకశక్తిని కూడా మెరుగుపరచుకోవచ్చు.
*గ్రీన్ టీ తాగడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.టైప్2 డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు వారిలో కలిగే ఒత్తిడులను గ్రీన్ టీ తాగడం వల్ల తగ్గించుకోవచ్చని తెలియజేశారు. అయితే దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంది.
*గ్రీన్ టీ లో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కేవలం ఆరోగ్యప్రయోజనాలను కలిగించడమే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా పెంపొందింపజేస్తుంది. గ్రీన్ టీ తాగడం వల్ల చర్మం పై ఏర్పడిన మచ్చలు తొలగిపోవడమే కాకుండా, జుట్టురాలే సమస్య నుంచి మనకు రక్షణ కల్పిస్తుంది. అలాగే శరీర బరువు తగ్గాలనుకునే వారికి గ్రీన్ టీ ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు. గ్రీన్ టీలో ఉన్నటువంటి యాంటీఆక్సిడెంట్లు, విటమిన్స్ మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి కీలకపాత్ర పోషిస్తాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…