స‌మాచారం

5 సంవత్సరాలలోపు పిల్లలకు ఆధార్ తీసుకోవాలా.. ఇలా అప్లై చేయండి..

మనదేశంలో ఆధార్ కార్డ్ ఎంతో ముఖ్యమైనదని చెప్పవచ్చు. ఆధార్ కార్డు పైనే మన నిత్య, బ్యాంక్ లావాదేవీలు ఇతర కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఆధార్ అనేది కేవలం పెద్దవారికి మాత్రమే కాకుండా పుట్టిన పిల్లలకు కూడా ఎంతో అవసరం. ఈ క్రమంలోనే చిన్న పిల్లలకు కూడా ఆధార్ కార్డ్ ఇవ్వడం మనం చూస్తుంటాము. ఈ క్రమంలోనే ఆధార్ కార్డ్ చేయడం కోసం ఐదు సంవత్సరాలలోపు చిన్నారి తల్లిదండ్రుల బయోడేటాను, చిన్నారి జనన ధ్రువీకరణ పత్రానికి సంబంధించిన సమాచారాన్ని అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది.

సాధారణంగా ఆధార్ అంటే బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. కాకపోతే ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు బయోమెట్రిక్ తీసుకోవడం లేదని ఈ సందర్భంగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. బయోమెట్రిక్ అంటే వేలిముద్ర లేదా ఐరిష్ స్కానింగ్ కలిగి ఉంటుంది.ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు ఈ విధమైనటువంటి బయోమెట్రిక్ అవసరం లేదని ఈ సందర్భంగా యుఐడిఎఐ వెల్లడించింది.

ఐదు సంవత్సరాలు తర్వాత నుంచి 15 సంవత్సరాల లోపు ఆ చిన్నారికి మరొకసారి బయోమెట్రిక్ అప్డేట్ చేయించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆ సమయంలో చిన్నారికి వేలిముద్ర, ఐరిష్ స్కాన్ బయోమెట్రిక్ తీసుకోనున్నట్లు తెలిపారు. కనుక ఐదు సంవత్సరాల పిల్లలకు ఎలాంటి బయోమెట్రిక్ అవసరం లేదని ఐదు సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపు వారి ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకుంటే సరిపోతుందని యుఐడిఎఐ తెలియజేస్తుంది.

*బాల ఆధార్ అప్లై చేయడం కోసం కోసం మొదట మీరు UIDAI అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి. ఈ వెబ్‌సైట్‌లో మీరు ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.

*ఇక్కడ పిల్లల పేరుతోపాటు తన పుట్టిన తేదీ, తన తల్లిదండ్రుల పేర్లు చిరునామాను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నీ పూర్తిచేసిన తర్వాత అపాయింట్మెంట్ బటన్ పై క్లిక్ చేయాలి.

*మీరు ఏ రోజు అయితే అపాయింట్మెంట్ తీసుకుంటారో ఆరోజు ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లి అక్కడ అ చిన్నారి జన పత్రాన్ని, తల్లిదండ్రుల ఆధార్ కార్డులను సమర్పించాలి.

*ఈ క్రమంలోనే బయోమెట్రిక్ సమాచారంతో పిల్లల ఆధార్ కార్డు అనుసంధానం చేస్తారు. ఐదు సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకి అయితే కేవలం వారి ఫోటో ఆధారంగా నమోదు చేస్తారు. ఈ విధంగా అన్ని ప్రక్రియలలో పూర్తయిన తర్వాత దరఖాస్తుదారునికి రసీదును ఇస్తారు. దీని ఆధారంగా మన ఆధార్ కార్డ్ స్థితి ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఆధార్ అప్లై చేసిన తర్వాత 60 రోజులకు మనకు ఎస్ఎంఎస్ వస్తుంది. ఇలా రాగానే ఆధార్ నమోదు సెంటర్ కు వెళ్లి ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM