Anjeer : రోజూ 3 తింటే చాలు.. శ‌రీరంలో జ‌రిగేది ఇదే..!

August 4, 2023 1:45 PM

Anjeer : చాలా మంది ప్రతి రోజూ పండ్లతోపాటు డ్రై ఫ్రూట్స్ ని కూడా తీసుకుంటూ ఉంటారు. అంజీరని కూడా చాలా మంది రోజు తీసుకుంటూ ఉంటారు. అంజీర పండ్లని తీసుకోవడం వలన చక్కటి లాభాలని పొందవ‌చ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంజీర పండ్లను తీసుకోవడం వలన చక్కటి లాభాలను పొందవచ్చు. అంజీర పండ్లను నీటిలో నానబెట్టుకుని తింటే చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అంజీర పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.

రాత్రిపూట వీటిని నానబెట్టుకుని ఉదయాన్నే తీసుకుంటే మంచిది. అంజీర ముక్కల్ని రెండు నుండి నాలుగు తీసుకోవచ్చు. ఇప్పుడు వాటిని తీసుకుని ఒక గిన్నెలో సగం వరకు నీళ్లు పోసి వాటిని రాత్రంతా నానబెట్టి, ఉదయం నీటిలో నుండి తీసేశాక పరగడుపున వీటిని తీసుకోవడం మంచిది. అంజీర పండ్లను తినడం వలన మలబద్ధకం సమస్య నుండి బయటపడవచ్చు. ఫైబర్ ఇందులో ఎక్కువగా ఉంటుంది.

Anjeer take them daily 3 for these benefits
Anjeer

అంజీర పండు శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంజీర పండ్లను తీసుకోవడం వలన క్యాల్షియం ఎక్కువగా అందుతుంది. ఎముకలకి అవసరమైన క్యాల్షియంని ఈ పండ్లతో పొంద‌వ‌చ్చు. అంజీర పండ్లలో క్యాలరీలు తక్కువ ఉంటాయి. ఫైబర్ వీటిలో ఎక్కువ ఉంటుంది. నానబెట్టిన అంజీర పండ్లను తీసుకుంటే బరువు కూడా కంట్రోల్ లో ఉంటుంది.

చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ వంటి వాటిని తీసుకునే బదులు, భోజనం తర్వాత అంజీర పండ్లని తీసుకోవచ్చు. డయాబెటిస్ తో బాధ పడే వాళ్ళు అంజీర పండ్లను తీసుకుంటే చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. చాలా తక్కువ సోడియం ఉంటుంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక లాభాలని మనం ఈ పండ్లని తీసుకొని పొంద‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment