50 మంది పేద పిల్ల‌ల‌ను ద‌త్త‌త తీసుకుని వారిని చ‌దివిస్తున్న మ‌హిళా పోలీసు కానిస్టేబుల్‌.. హ్యాట్సాఫ్..!

July 12, 2021 8:45 PM

స‌మాజంలో ఉన్న తోటి వారికి మ‌న‌కు చేత‌నైనంత స‌హాయం చేయాలి. స‌మాజం అంటే కేవ‌లం మ‌నం జీవించ‌డ‌మే కాదు, పేద వారు జీవించేందుకు కూడా స‌హాయం చేయాలి. స‌రిగ్గా ఇలా అనుకుంది కాబ‌ట్టే ఆ మ‌హిళ 50 మంది పేద పిల్ల‌ల‌ను ద‌త్త‌త తీసుకుని వారిని చ‌దివిస్తోంది. ఆమే.. మ‌హారాష్ట్ర‌కు చెందిన ర‌హెనా షేక్‌.

this woman police constable adopted 50 poor children

రాయ్‌గ‌డ్ జిల్లా వాజే తాలూకాలో ఉన్న ద్యాని విద్యాల‌య‌లో చ‌దువుతున్న 50 మంది పేద పిల్ల‌ల‌ను ర‌హెనా ద‌త్త‌త తీసుకుంది. త‌న‌కు తెలిసిన వారి ద్వారా ఆ స్కూల్ గురించి ఆమె స‌మాచారం అందుకుంది. ఈ క్ర‌మంలోనే ఆ స్కూల్‌లో చ‌దువుతున్న పేద విద్యార్థుల‌కు సహాయం చేయాలని సంక‌ల్పించింది. త‌న కుమార్తె బ‌ర్త్ డే వేడుక‌ల‌ను జ‌ర‌ప‌కుండా ఆ డ‌బ్బుతో ఆ స్కూల్ పిల్ల‌ల‌కు కావ‌ల్సిన సామగ్రిని కొనిచ్చింది. వారిని ఆమె ద‌త్త‌త తీసుకుని చ‌దివిస్తోంది.

కాగా ఆమె చేస్తున్న సేవ‌ల‌కు గుర్తింపు కూడా ల‌భించింది. ఆమెకు ముంబై పోలీస్ క‌మిష‌న‌ర్ హేమంత్ నాగ్రాలె స‌ర్టిఫికెట్ ఆఫ్ ఎక్స‌లెన్స్‌ను అందించారు. ఆమె 21 ఏళ్లుగా పోలీస్ స‌ర్వీస్‌లో ఉండ‌గా, ఆమె చ‌క్క‌ని వాలీబాల్ ప్లేయ‌ర్ కూడా. ఈ క్ర‌మంలోనే పేద విద్యార్థుల ప‌ట్ల ఆమె చూపుతున్న క‌రుణ‌కు అంద‌రూ ఆమెను ప్ర‌శంసిస్తున్నారు. ఆమె హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment