గతేడాది కరోనా లాక్ డౌన్ ఉన్నప్పటికీ రిటెయిల్ రంగం ఎంతగానో లాభపడింది. డిమార్ట్, జియోమార్ట్‌లతోపాటు పలు ఇతర రిటెయిల్, ఈ-కామర్స్ సంస్థలు భారీగా లాభాలను ఆర్జించాయి. అయితే రిటెయిల్ రంగంలో డిమార్ట్ మాతృసంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ భారీగా లాభాలను సాధించింది. ఈ క్రమంలోనే అవెన్యూ సూపర్‌మార్ట్స్ ప్రమోటర్, అధినేత రాధాకిషన్ దమాని ప్రపంచంలోని టాప్ 100 ధనవంతుల్లో ఒకరిగా నిలిచారు.
బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, దమాని ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో 97వ స్థానంలో నిలిచారు. ఆయన మొత్తం ఆస్తి విలువ 19.3 బిలియన్ డాలర్లు లేదా రూ.1.43 లక్షల కోట్లు. గత 18 నెలల కాలంలో ఆయన ఆస్తి విలువ 60 శాతం పెరిగింది. మార్చి 1, 2020లో 12 బిలియన్ డాలర్లు ఉన్న ఆయన ఆస్తి విలువ ప్రస్తుతం 19.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ క్రమంలోనే ఆయన టాప్ 100 ధనికుల జాబితాలో చోటు సంపాదించారు.
వాస్తవానికి అనేక ఈ-కామర్స్ సంస్థలు రిటెయిల్ రంగంలో పోటీగా వ్యాపారం చేస్తున్నప్పటికీ డిమార్ట్‌ను ఢీకొట్టలేకపోతున్నాయి. వస్తువుల ధరల విషయంలో ఇప్పటికీ డిమార్ట్‌దే పైచేయిగా ఉంది. వినియోగదారులకు తక్కువ ధరలకే వస్తువులను అందిస్తుందన్న పేరును డిమార్ట్ నిలబెట్టుకుంటోంది. ఆఫ్‌లైన్ స్టోర్‌లోనూ ఆన్‌లైన్‌లో లేని విధంగా ధరలను అందిస్తోంది. అందుకనే డిమార్ట్ లాభాల బాటలో నడుస్తోంది.
స్టాక్ మార్కెట్ పరంగా కూడా పెట్టుబడిదారులకు ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ కల్పతరువులా మారింది. అందులో వారికి భారీ లాభాలు వస్తున్నాయి. అయితే దమానికి ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌లో 74.90 శాతం వాటా ఉండగా, ఆయన పలు ఇతర కంపెనీల్లోనూ వాటాలను కలిగి ఉన్నారు. గత ఏడాదిన్నర కాలంగా ఆయా కంపెనీల వ్యాపారం కూడా బాగానే సాగింది. అందుకనే ఆయన సంపద పెరిగింది. ఆయనకు ఇండియా సిమెంట్స్‌లో 11.3 శాతం, వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌లో 26 శాతం, సుందరం ఫైనాన్స్‌లో 2.4 శాతం వాటాలు ఉన్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…