ప్ర‌పంచంలోని టాప్ 100 ధ‌నికుల జాబితాలో డిమార్ట్ య‌జ‌మాని రాధాకిష‌న్ ద‌మానికి చోటు.. మొత్తం ఆస్తి విలువ రూ.1.43 ల‌క్ష‌ల కోట్లు..!

August 19, 2021 11:02 AM

గ‌తేడాది క‌రోనా లాక్ డౌన్ ఉన్న‌ప్ప‌టికీ రిటెయిల్ రంగం ఎంత‌గానో లాభ‌ప‌డింది. డిమార్ట్‌, జియోమార్ట్‌ల‌తోపాటు ప‌లు ఇత‌ర రిటెయిల్‌, ఈ-కామ‌ర్స్ సంస్థ‌లు భారీగా లాభాల‌ను ఆర్జించాయి. అయితే రిటెయిల్ రంగంలో డిమార్ట్ మాతృసంస్థ ఎవెన్యూ సూప‌ర్‌మార్ట్స్ భారీగా లాభాల‌ను సాధించింది. ఈ క్ర‌మంలోనే అవెన్యూ సూప‌ర్‌మార్ట్స్ ప్ర‌మోట‌ర్‌, అధినేత రాధాకిష‌న్ ద‌మాని ప్ర‌పంచంలోని టాప్ 100 ధ‌న‌వంతుల్లో ఒక‌రిగా నిలిచారు.

ప్ర‌పంచంలోని టాప్ 100 ధ‌నికుల జాబితాలో డిమార్ట్ య‌జ‌మాని రాధాకిష‌న్ ద‌మానికి చోటు.. మొత్తం ఆస్తి విలువ రూ.1.43 ల‌క్ష‌ల కోట్లు..!

బ్లూమ్‌బ‌ర్గ్ బిలియ‌నీర్స్ ఇండెక్స్ ప్ర‌కారం, ద‌మాని ప్ర‌పంచంలోని ధ‌న‌వంతుల జాబితాలో 97వ స్థానంలో నిలిచారు. ఆయ‌న మొత్తం ఆస్తి విలువ 19.3 బిలియ‌న్ డాల‌ర్లు లేదా రూ.1.43 ల‌క్ష‌ల కోట్లు. గ‌త 18 నెల‌ల కాలంలో ఆయ‌న ఆస్తి విలువ 60 శాతం పెరిగింది. మార్చి 1, 2020లో 12 బిలియ‌న్ డాల‌ర్లు ఉన్న ఆయ‌న ఆస్తి విలువ ప్రస్తుతం 19.3 బిలియ‌న్ డాలర్ల‌కు చేరుకుంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న టాప్ 100 ధ‌నికుల జాబితాలో చోటు సంపాదించారు.

వాస్త‌వానికి అనేక ఈ-కామ‌ర్స్ సంస్థ‌లు రిటెయిల్ రంగంలో పోటీగా వ్యాపారం చేస్తున్న‌ప్ప‌టికీ డిమార్ట్‌ను ఢీకొట్ట‌లేక‌పోతున్నాయి. వ‌స్తువుల ధ‌రల విష‌యంలో ఇప్ప‌టికీ డిమార్ట్‌దే పైచేయిగా ఉంది. వినియోగ‌దారుల‌కు త‌క్కువ ధ‌ర‌ల‌కే వస్తువులను అందిస్తుంద‌న్న పేరును డిమార్ట్ నిల‌బెట్టుకుంటోంది. ఆఫ్‌లైన్ స్టోర్‌లోనూ ఆన్‌లైన్‌లో లేని విధంగా ధ‌ర‌ల‌ను అందిస్తోంది. అందుక‌నే డిమార్ట్ లాభాల బాటలో న‌డుస్తోంది.

స్టాక్ మార్కెట్ ప‌రంగా కూడా పెట్టుబ‌డిదారుల‌కు ఎవెన్యూ సూప‌ర్‌మార్ట్స్ క‌ల్ప‌త‌రువులా మారింది. అందులో వారికి భారీ లాభాలు వ‌స్తున్నాయి. అయితే ద‌మానికి ఎవెన్యూ సూప‌ర్‌మార్ట్స్‌లో 74.90 శాతం వాటా ఉండ‌గా, ఆయన ప‌లు ఇత‌ర కంపెనీల్లోనూ వాటాల‌ను క‌లిగి ఉన్నారు. గ‌త ఏడాదిన్న‌ర కాలంగా ఆయా కంపెనీల వ్యాపారం కూడా బాగానే సాగింది. అందుక‌నే ఆయ‌న సంప‌ద పెరిగింది. ఆయ‌న‌కు ఇండియా సిమెంట్స్‌లో 11.3 శాతం, వీఎస్‌టీ ఇండ‌స్ట్రీస్‌లో 26 శాతం, సుంద‌రం ఫైనాన్స్‌లో 2.4 శాతం వాటాలు ఉన్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now