Chanakya : పురుషుల కోసం చాణక్యుడు చెప్పిన అతి ముఖ్యమైన సూత్రాలు.. వీటిని పాటిస్తే ఇక తిరుగుండదు..!

April 17, 2023 11:59 AM

Chanakya : పూర్వ కాలం నుంచి మనం మన పెద్దలు చెప్పిన ఎన్నో ముఖ్యమైన విషయాలను పాటిస్తూ వస్తున్నాం. వాటిల్లో కొన్ని సైన్స్‌తోనూ ముడిపడి ఉంటాయి. కనుక నేటి తరం వారు కూడా ఇలాంటి అనేక విషయాలను అనుసరిస్తున్నారు. అలాగే ఆచార్య చాణక్యుడు కూడా మన జీవితం సుఖమయంగా సాగేందుకు గాను ఎన్నో నీతి సూత్రాలను చెప్పాడు. ముఖ్యంగా ఆయన పురుషుల కోసం ఎన్నో ధర్య వాక్యాలను చెప్పాడు. వాటిని అనుసరిస్తే ఇక పురుషులకు తిరుగుండదు. వారు తమ జీవితంలో విజయవంతంగా దూసుకెళ్తారు. ఇక చాణక్యుడు పురుషుల కోసం చెప్పిన ఆ ముఖ్యమైన సూత్రాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

పురుషుడు తనను మోసం చేసిన మహిళల దగ్గరకు మళ్లీ వెళ్లకూడదు. వారితో ఎలాంటి రిలేషన్‌షిప్‌ నూ పెట్టుకోకూడదు. పరాయి పురుషుడు లేదా స్త్రీ మిమ్మల్ని అగౌరవపరిచినా.. అమర్యాదగా ప్రవర్తించినా అసలు సహించకూడదు. కూర్చుని ఉన్నప్పుడు ఎవరితోనూ చేతులు కలపరాదు. ఇతరులను ఇంప్రెస్‌ చేసేందుకు మిమ్మల్ని మీరు తక్కువ చేసి చూపించుకోకూడదు. మీకు చెందని ఆహారం చివరి వంతును మీరు తినకూడదు. రోజు రోజుకీ అన్ని విషయాల్లోనూ మరింత మెరుగయ్యేందుకు కృషి చేయండి.

Chanakya important rules for development in life
Chanakya

మీకు మర్యాద ఇచ్చేవారు, మీ వెనుక ఉండే వారిని ఎల్లప్పుడూ రక్షించండి. ఎదుటి వారిని ఒక ప్రశ్న అడిగిన తరువాత వారు సమాధానం చెప్పే వరకు వేచి చూడండి. ఇతరులతో బంధాలను పెంచుకునేందుకు వెంపర్లాడరాదు. వారంలో కనీసం 4 రోజులు వ్యాయామం చేయండి. పిలవని కార్యక్రమాలకు వెళ్లకండి. బయటకు వెళ్లినప్పుడు జేబులో ఎల్లప్పుడూ ఎంతో కొంత డబ్బు ఉండేలా చూసుకోండి.

ఎలాంటి సందర్భం అయినా సరే దుస్తులను సరిగ్గా ధరించండి. అసభ్యంగా, అంద విహీనంగా ధరించకండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు వారి కళ్లలో చూసి మాట్లాడండి. వారు ఏమడిగినా వారి కళ్లలోకి చూస్తూ సమాధానం చెప్పండి. అవును, కాదు అని తలూపినా సరే.. వారి కళ్లలోకి చూస్తూ అలా చేయండి. డబ్బు సంపాదించేందుకు కేవలం ఒకే మార్గం కాకుండా ఇతర మార్గాలపై కూడా దృష్టి పెట్టండి. ఇలా చాణక్యుడు చెప్పిన సూత్రాలను పాటిస్తే పురుషులు ఏ రంగంలో అయినా సరే రాణించగలరు. ఇక వారికి అసలే తిరుగుండదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment