ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు కేసును నర్సింగి పోలీసులకు బదిలీ చేశారు. జానీ మాస్టర్ పై తొలుత 375 అత్యాచారంతోపాటు పలు సెక్షన్లు నమోదు చేశారు. తాజాగా ఫోక్సో కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి వయస్సు దృష్ట్యా ఈ కేసు నమోదు చేశారు.జానీ మాస్టర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతనిని విచారించేందుకు నోటీసులు అందచేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం జానీ మాస్టర్ హైదరాబాద్ లో లేడని తెలుస్తుంది. అతను నెల్లూరులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో నార్సింగ్ పోలీసులు.. నెల్లూరు పోలీసులతో సంప్రదింపులు జరిపి.. మొదట నోటీసులు అందచేసి విచారణ కొనసాగించే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో కూడా స్ప్రెడ్ అవ్వడంతో.. జాని మాస్టర్ నెల్లూరులో ఎక్కడ ఉన్నారా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. జానీ మాస్టర్ స్వస్థలం నెల్లూరు కావడంతో.. బంధువుల ఇంట్లోనే ఉండి ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ విషయానికి సంబంధించిన పూర్తి విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది..కొన్ని రోజుల క్రితమే ఉత్తమ కొరియోగ్రాఫర్ గా తిరు అనే తమిళ చిత్రానికి జాతీయ అవార్డు ని అందుకున్న జానీ మాస్టర్ 2009 లో ఎంట్రీ ఇచ్చి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో హిట్ సాంగ్స్ కి కొరియోగ్రఫీ ని అందించాడు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో, టాలీవుడ్ ఇండస్ట్రీలో జానీ మాస్టర్ కేసు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఇష్యు గురించి తెలుసుకున్న తర్వాత నెటిజన్లు జానీపై మండి పడుతున్నారు. తాను మైనర్ గా ఉన్నప్పటినుంచే జానీ మాస్టర్ ఆమెను వేధిస్తున్నట్లు బాధితురాలు ఫిర్యాదు పేర్కొంది. ఇదే విషయం ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద కూడా బయటకు తీసుకుని వచ్చింది. అసలు నిజా నిజాలు ఏమై ఉంటాయి అనేది జానీ మాస్టర్ ను కూడా విచారిస్తే కానీ తెలియదు. మరి కొద్దీ రోజుల్లో ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు బయటపడనున్నాయి. ఏదేమైనా పోలీసులు అన్ని కోణాలలో విశ్లేషించి.. ఈ కేసును సీరియస్ గా తీసుకోవాలంటూ నెటిజన్లు కూడా వాపోతున్నారు.
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…