సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్త్రీ’ మూవీ బాలీవుడ్ బాక్సాపీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ‘స్త్రీ2’ మూవీ ఈ యేడాది ఆగష్టు 15న విడుదలై సంచలన విజయం సాధించింది. తొలి రోజు నుంచే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామీ సృష్టించింది. తొలి రోజు ఈ సినిమా రూ. 55.40 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ముందు రోజు ప్రీమియర్స్ ద్వారా 9.40 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. మొత్తంగా తొలి రోజు ఈ సినిమా 64.80 కోట్ల నెట్ వసూళ్లతో బాలీవుడ్ లో సంచలనం రేపింది.
శ్రద్దా కపూర్, రాజ్ కుమార్ రావ్ రెమ్యునరేషన్లు, ఇతర సాంకేతిక నిపుణుల పారితోషికంతోపాటు ఈ ప్రమోషనల్ ఖర్చులన్నీ కలిపి ఈ సినిమాను 60 కోట్ల రూపాయలతో రూపొందించారు. ఈ మూవీకి భారీ ఆదరణ ఉండటంతో సుమారుగా 5500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.ఈ చిత్రం హిందీ సినిమా పరిశ్రమలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు షారుక్ నటించిన జవాన్ సినిమా సాధించిన అత్యధిక వసూళ్ల రికార్డును, యానిమల్, హృతిక్ రోషన్ ఫైటర్ లైఫ్ టైమ్ కలెక్షన్లను అధిగమించింది. హిందీ సినిమా రంగంలో ఇప్పటి వరకు జవాన్ చిత్రం 584 కోట్ల రూపాయలతో అత్యదిక వసూళ్లు సాధించిన సినిమాగా ఘనతను సాధించింది. తాజాగా స్త్రీ 2 చిత్రం 586 కోట్ల రూపాయలు వసూలు చేయడం ద్వారా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.
తొలి భాగం కంటే బ్లాక్ బస్టర్ గా నిలిచింది స్త్రీ2. ఈ సీక్వెల్లో కొత్తగా సర్కటా అనే దెయ్యాన్ని చూపించారు. నవ్విస్తూనే భయపెడుతున్న ఈ సినిమాను చూడటానికి ప్రేక్షకులు ఎగబడుతున్నారు. ఇక థియేటర్లలో ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తున్నా.. స్త్రీ2 మూవీ త్వరలోనే ఓటీటీలో అడుగుపెట్టనుంది. సెప్టెంబర్ 27 నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లోకి రానుందని భావిస్తున్నారు. అయితే ఫ్రీగా కాకుండా రెంట్ విధానంలో మూవీ వచ్చే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…