వినోదం

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే ప‌వ‌న్ ఇప్పుడు ప్ర‌భుత్వంలో ఉన్నా అడ‌పాద‌డ‌పా త‌న సినిమాల‌తో అల‌రించ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇక ప‌వ‌న్ క‌ళ్యాన్ ప్ర‌తి సినిమాలో క‌నిపించే ఆలీ ఈ మ‌ధ్య దూరంగా ఉంటుండడం మ‌నం చూస్తూనే ఉన్నాం. అలీ గ‌తంలో వైకాపాలో చేరి జ‌న‌సేన‌ను విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. పరిస్థితులు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించడానికి దారితీయ‌గా, ప‌వ‌న్ స్నేహితుడు అలీ వైసీపీలో చేరాల్సొచ్చింది. ఆ త‌ర్వాత ఇద్ద‌రి స్నేహం బీట‌లు వారింది. గ‌త ఎన్నికల సమయంలో అలీ తన జనసేన పార్టీలో ఎందుకు చేరలేదని ప‌వ‌న్ ప్ర‌శ్న‌ల్ని ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. అది కొంద‌రు జ‌న‌సేన‌ మద్దతుదారులను కలవరపెట్టింది.

ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో అలీని నటింపజేయకపోవడంతో ఇద్దరూ ఒకరికొకరు దూరమయ్యారు. అయితే తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా అలీ పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక ఆహ్వానం అందించాడు. కానీ వ్యక్తిగత కారణాల వల్ల పవన్ హాజరు కాలేదు. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్‌తో ఉన్న అనుబంధం కారణంగా ప్రజల దృష్టిని ఆకర్షించిన అలీ కుమార్తె వివాహం చర్చనీయాంశంగా మారింది. ఇక ఎన్నిక‌ల్లో వైకాపా దారుణంగా ఓట‌మి పాల‌య్యాక అలీ ఆ పార్టీ నుంచి నిష్కృమించిన సంగ‌తి తెలిసిందే. అయినా కానీ చాలా కాలంగా పవన్ కళ్యాణ్, అలీ కలిసి సినిమాల్లో కనిపించ లేదు.

అయితే ప‌వ‌న్ `ఓజీ` సినిమాలో ప‌వ‌న్ అవ‌కాశం క‌ల్పించాడ‌ని అలీ స్వ‌యంగా స‌రిపోదా శ‌నివారం ఈవెంట్లో వెల్ల‌డించ‌గా అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. పెద్ద తెర‌పై ఆ ఇద్ద‌రి క‌ల‌యిక‌ను చూడాల‌ని అభిమానులు ఆశ‌ప‌డుతున్నారు. ఇక ‘ఉత్సవం’ సినిమా విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్న అలీ.. పవన్ కళ్యాణ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.పవన్ కళ్యాణ్‌తో మీ అనుబంధం ఇప్పుడు ఎలా ఉందని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు అలీ సమాధానం ఇస్తూ.. మా అనుబంధం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉందని నవ్వులు పూయించారు.ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే తప్పకుండా పని చేస్తానని ఈ సందర్భంగా అలీ వివరణ ఇచ్చారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఐపీఎల్ 2026 షెడ్యూల్ వచ్చేసింది.. తొలి పోరులో ఆర్‌సీబీ vs ఎస్‌ఆర్‌హెచ్!

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం (మార్చి 11, 2026) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 తొలి…

Wednesday, 11 March 2026, 10:24 PM

విడాకులు తీసుకున్న హన్సిక.. పెళ్లయిన రెండేళ్లకే భర్తతో బంధం కట్! భరణం కూడా వద్దంటూ..

నటి హన్సికా మోత్వాని, వ్యాపారవేత్త సోహైల్ కతూరియా నాలుగేళ్ల వివాహ జీవితానికి అధికారికంగా ముగింపు పలికారు. పరస్పర సమ్మతితో దాఖలు…

Wednesday, 11 March 2026, 9:27 PM

ఉద్రిక్తతల మధ్య క్షేమంగా చెన్నైకి అజిత్.. దుబాయ్ నుండి రాక.. వీడియో వైరల్!

ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్ధంతో మధ్యప్రాచ్యంలో నెల‌కొన్న భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా విమానాల రాకపోకల్లో ఏర్పడిన అంతరాయాల మధ్య త‌మిళ నటుడు…

Wednesday, 11 March 2026, 6:19 PM

వరల్డ్ కప్ నెగ్గిన ఆనందంలో అర్ష్‌దీప్‌కు ఐసీసీ షాక్.. ఫైనల్ మ్యాచ్‌లో ఏం జరిగిందంటే?

టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్‌ను గెలుచుకున్న కొన్ని రోజులకే భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి…

Wednesday, 11 March 2026, 2:59 PM

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM