Unstoppable With NBK : నందమూరి బాలకృష్ణ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. వెండితెరపైన, డిజిటల్ ఫ్లాట్ ఫాంలోనూ బాలకృష్ణ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. బాలయ్య నటించిన అఖండ చిత్రం పెద్ద హిట్ కావడంతో ప్రస్తుతం ఆయన సక్సెస్ మూడ్‌లో ఉన్నారు. ఇక అన్‌స్టాపబుల్ షోకి కూడా మంచి రేటింగ్స్ వస్తుండడంతో ఆయన జోరుకి అడ్డే లేకుండా పోయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వేదికగా అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షోతో హోస్ట్‌గానూ ప్రేక్షకులను అలరిస్తున్నారు బాలకృష్ణ.
ఈ టాక్ షోకు ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే ఈ షోలో కలెక్షన్ కింగ్ మెహన్ బాబు, మంచు విష్ణు, మంచులక్ష్మీ.. న్యాచులర్ స్టార్ నాని, బ్రహ్మానందం, డైరెక్టర్ అనిల్ రావిపూడి వచ్చి సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ఈ షోకు సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ 4 ప్రోమోను విడుదల చేశారు మేకర్స్.
ఇందులో అఖండ చిత్రయూనిట్.. డైరెక్టర్ బోయపాటి శ్రీను, శ్రీకాంత్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్ వచ్చి అలరించారు. ప్రోమోలో ప్రగ్యా జైస్వాల్.. బోయపాటి సర్, బాలకృష్ణ సర్ అనగా.. సర్ సర్ ఏంటీ అంటూ తలపట్టుకున్నారు బాలకృష్ణ.
దీంతో ఓకే బాలా అనేసింది ప్రగ్యా జైస్వాల్.. బాలానా అంటూ షాకయ్యారు బాలకృష్ణ. ఇక ఆ తర్వాత అఖండ సినిమాలోని పవర్ఫుల్ డైలాగ్ ను శ్రీకాంత్ చెప్పగా.. బాలయ్య సైతం తన స్టైల్‌లో డైలాగ్ చెప్పి అదరగొట్టారు. బోయపాటిని కూడా మాలిని అంటే మాజీ ప్రేయసిని అంటూ ఆట పట్టించారు. చివరలో వెన్ను పోటుకి సంబంధించి చెబుతూ ఎమోనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమో ఆకట్టుకుంటోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…