Bigg Boss 5 : బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. 19 మందితో మొదలైన ఈ షోలో ప్రస్తుతం ఆరుగురు మాత్రమే ఉన్నారు. తాజాగా 13వ కంటెస్టెంట్‌గా ప్రియాంక బయటకు వచ్చింది. అయితే తమన్నా లా పింకీ అరిచి గోలగోల చేయలేదు. ఒకట్రెండు సందర్భాల్లో తప్ప కంటెస్టెంట్లతో పెద్దగా గొడవ పడిన సందర్భాలు కూడా లేవు. తనకు ఇష్టమైన కిచెన్ రూంలోనే గడుపుతూ హౌస్‌మేట్లకు ఇష్టమైన ఆహార పదార్థాలు వండిపెట్టింది. అప్పుడప్పుడూ మానస్ పరధ్యానంలో ఉండేది.
మానస్‌పై ఎక్కువ ఆశలు పెట్టుకున్న ప్రియాంకకి అరియానా పెద్ద షాక్ ఇచ్చింది. ఎలిమినేట్ అయిన తర్వాత అరియానా బజ్‌లో పాల్గొనగా, అందులో అరియానా పలు టాస్క్‌లు ఇచ్చింది. టాస్కులో డౌన్ తంబ్ సింబల్ కాజల్‌కు ఇవ్వగా.. లవ్ సింబల్ శ్రీరామచంద్రకు ఇచ్చింది. ఇక పంచ్ సింబల్ మాత్రం మానస్‌కు ఇచ్చి షాకిచ్చింది పింకీ. అలా ఎందుకు అని అరియానా అడగ్గా.. ఏదైనా ఉంటే నాతో మాట్లాడోచ్చు కదా.. అంటూ సమాధానమిచ్చింది.
టైటిల్ ఎవరు గెలుస్తారనుకుంటున్నారని అడగ్గా.. మానస్ అంటూ బదులిచ్చింది పింకీ. దీంతో మానస్, కాజల్.. ప్రియాంక గురించి వీడియోను చూపించి షాకిచ్చింది అరియానా. ఆ వీడియో చూసి షాకైన పింకీ.. మానస్ చాలా సారీ.. ఇది నీ నుంచి నేను ఎక్స్ పెక్ట్ చేయలేదు అంటూ చెప్పుకొచ్చింది. మానస్‌కు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా.. అని అడగ్గా.. మానస్ గురించి నేను ఇప్పుడు తెలుసుకుంది ఏంటంటే.. ఎవరినైనా చదివి పక్కనపెట్టేస్తాడు. నాకు పిల్లలుంటే ఎలా చూసుకునేదాన్నో అలాగే చూసుకుంటానంటూ కన్నీళ్లు పెట్టుకుంది ప్రియాంక.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…