Unstoppable With NBK : పాప నాది అంటూ.. ప్ర‌గ్యాతో ర‌చ్చ చేసిన బాల‌కృష్ణ‌..!

December 6, 2021 5:00 PM

Unstoppable With NBK : నందమూరి బాల‌కృష్ణ ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. వెండితెరపైన‌, డిజిట‌ల్ ఫ్లాట్ ఫాంలోనూ బాల‌కృష్ణ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. బాలయ్య న‌టించిన అఖండ చిత్రం పెద్ద హిట్ కావడంతో ప్ర‌స్తుతం ఆయ‌న స‌క్సెస్ మూడ్‌లో ఉన్నారు. ఇక అన్‌స్టాప‌బుల్ షోకి కూడా మంచి రేటింగ్స్‌ వ‌స్తుండ‌డంతో ఆయ‌న జోరుకి అడ్డే లేకుండా పోయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వేదికగా అన్‏స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షోతో హోస్ట్‏గానూ ప్రేక్షకులను అలరిస్తున్నారు బాలకృష్ణ.

Unstoppable With NBK balakrishna enjoyed with pragya jaiswal in latest episode

ఈ టాక్ షోకు ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే ఈ షోలో కలెక్షన్ కింగ్ మెహన్ బాబు, మంచు విష్ణు, మంచులక్ష్మీ.. న్యాచులర్ స్టార్ నాని, బ్రహ్మానందం, డైరెక్టర్ అనిల్ రావిపూడి వచ్చి సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ఈ షోకు సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా అన్‏స్టాపబుల్ ఎపిసోడ్ 4 ప్రోమోను విడుదల చేశారు మేకర్స్.

ఇందులో అఖండ చిత్రయూనిట్.. డైరెక్టర్ బోయపాటి శ్రీను, శ్రీకాంత్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్ వచ్చి అలరించారు. ప్రోమోలో ప్ర‌గ్యా జైస్వాల్.. బోయపాటి సర్, బాలకృష్ణ సర్ అనగా.. సర్ సర్ ఏంటీ అంటూ తలపట్టుకున్నారు బాలకృష్ణ.

దీంతో ఓకే బాలా అనేసింది ప్రగ్యా జైస్వాల్.. బాలానా అంటూ షాకయ్యారు బాలకృష్ణ. ఇక ఆ తర్వాత అఖండ సినిమాలోని పవర్‏ఫుల్ డైలాగ్ ను శ్రీకాంత్ చెప్పగా.. బాలయ్య సైతం తన స్టైల్‌లో డైలాగ్ చెప్పి అదరగొట్టారు. బోయ‌పాటిని కూడా మాలిని అంటే మాజీ ప్రేయ‌సిని అంటూ ఆట ప‌ట్టించారు. చివ‌ర‌లో వెన్ను పోటుకి సంబంధించి చెబుతూ ఎమోన‌ల్ అయ్యారు. ప్ర‌స్తుతం ఈ ప్రోమో ఆక‌ట్టుకుంటోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now