Tiger 3 OTT Release Date : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న విషయం తెలిసిందే. సుదీర్ఘ కాలంగా తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న సల్మాన్ ఖాన్.. ఈ మధ్య కాలంలో మాత్రం సరైన విజయాన్ని సొంతం చేసుకోలేదు. మంచి హిట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. రీసెంట్‌గా టైగర్ 3అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించాడు. మనీష్ శర్మ తెరకెక్కించిన ఈ సినిమాకు ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. నార్త్ నుంచి సౌత్ వరకూ ఆడియెన్స్ మంచి స్పందనను అందించలేదు. ఫలితంగా ఈ చిత్రం ఫుల్ రన్‌లో రూ. 280 కోట్లు వరకు నెట్ వసూళ్లనే మాత్రమే రాబట్ట, ఈ చిత్రం రూ. 30 కోట్లు నష్టాలతోనే నిరాశ పరిచింది. దీంతో సల్మాన్ ఫ్యాన్స్‌కు మరో షాక్ కూడా తగిలినట్లైంది.
దీపావళి సందర్భంగా నవంబర్ 12న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సరిగ్గా నెల రోజుల తర్వాత అంటే డిసెంబర్ 12న అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి రానుంది. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ నెలకొనగా, ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. విడుదలైన 50 రోజుల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా డీల్ చేశారు. కాని మూవీకి మిక్స్డ్ టాక్ రావడంతో ఈ చిత్రాన్ని కేవలం నెల రోజులకే స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు సమాచారం. మరి దీనిపై క్లారిటీ రావలసి ఉంది.
సల్మాన్ ఖాన్ , కత్రినా కైఫ్ జంటగా నటించిన ఈ చిత్రం YRF స్పై యూనివర్స్ లో భాగంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టైగర్, టైగర్ జిందా హై తర్వాత మూడవ వచ్చిన ఈ చిత్రం వంద కోట్ల క్లబ్ లో చేరిన 17వ చిత్రంగా నిలిచింది. .పాకిస్తాన్ ప్రధానిని హత్య చేసి అధికారం చేజిక్కిచ్చుకుందామనే తీవ్రవాదులపై భారత గూఢాచారి సాగించిన పోరాటం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కగా ప్రతి నాయకుడిగా బాటీవుడ్ హీరో ఇమ్రాన్ హస్మీ నటించాడు. చిత్రంలో షారుఖ్ ఖాన్ ఒక ప్రత్యేక అతిథి పాత్రలో కనిపిస్తాడు. చివర్లో హ్రితిక్ రోషన్ కూడా కనిపిస్తాడు. సినిమాలో కత్రినా కైఫ్ టవల్ ఫైట్ ఓ రేంజ్ లో ఉండి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…