Tiger 3 OTT Release Date : ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న టైగ‌ర్ 3.. ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కానుంది అంటే..!

December 5, 2023 1:42 PM

Tiger 3 OTT Release Date : బాలీవుడ్ కండ‌ల వీరుడు సల్మాన్ ఖాన్ వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న విష‌యం తెలిసిందే. సుదీర్ఘ కాలంగా తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న స‌ల్మాన్ ఖాన్.. ఈ మధ్య కాలంలో మాత్రం సరైన విజయాన్ని సొంతం చేసుకోలేదు. మంచి హిట్ కోసం ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తున్నాడు. రీసెంట్‌గా టైగ‌ర్ 3అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించాడు. మ‌నీష్ శర్మ తెరకెక్కించిన ఈ సినిమాకు ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. నార్త్ నుంచి సౌత్ వరకూ ఆడియెన్స్ మంచి స్పందనను అందించలేదు. ఫలితంగా ఈ చిత్రం ఫుల్ రన్‌లో రూ. 280 కోట్లు వరకు నెట్ వసూళ్లనే మాత్ర‌మే రాబ‌ట్ట‌, ఈ చిత్రం రూ. 30 కోట్లు నష్టాలతోనే నిరాశ పరిచింది. దీంతో సల్మాన్ ఫ్యాన్స్‌కు మరో షాక్ కూడా తగిలినట్లైంది.

దీపావళి సందర్భంగా నవంబర్ 12న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సరిగ్గా నెల రోజుల తర్వాత అంటే డిసెంబర్ 12న అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి రానుంది. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ నెల‌కొనగా, ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. విడుదలైన 50 రోజుల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా డీల్ చేశారు. కాని మూవీకి మిక్స్డ్ టాక్ రావ‌డంతో ఈ చిత్రాన్ని కేవలం నెల రోజులకే స్ట్రీమింగ్ చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం. మ‌రి దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

Tiger 3 OTT Release Date know the platform and streaming details
Tiger 3 OTT Release Date

సల్మాన్ ఖాన్ , కత్రినా కైఫ్ జంటగా నటించిన ఈ చిత్రం YRF స్పై యూనివర్స్ లో భాగంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. టైగర్, టైగర్ జిందా హై తర్వాత మూడవ వచ్చిన ఈ చిత్రం వంద కోట్ల క్లబ్ లో చేరిన 17వ చిత్రంగా నిలిచింది. .పాకిస్తాన్ ప్రధానిని హత్య చేసి అధికారం చేజిక్కిచ్చుకుందామనే తీవ్రవాదులపై భారత గూఢాచారి సాగించిన పోరాటం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కగా ప్రతి నాయకుడిగా బాటీవుడ్ హీరో ఇమ్రాన్ హస్మీ నటించాడు. చిత్రంలో షారుఖ్ ఖాన్ ఒక ప్రత్యేక అతిథి పాత్రలో కనిపిస్తాడు. చివర్లో హ్రితిక్ రోషన్ కూడా కనిపిస్తాడు. సినిమాలో కత్రినా కైఫ్ టవల్ ఫైట్ ఓ రేంజ్ లో ఉండి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now