వినోదం

నా భ‌ర్త ఎప్పుడూ నాకు భారం అయ్యేలా ప్ర‌వ‌ర్తించ‌లేదు.. తాప్సీ ఎమోషనల్ కామెంట్స్!

తన వైవాహిక జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్న తాప్సీ. Photo Credit: Mathias Boe/Instagram.

త‌న వైవాహిక జీవితం ప్ర‌స్తుతం ఎంతో సంతోష‌క‌రంగా ఉంద‌ని, భ‌ర్త మ‌థియాస్ బో త‌నకు భారంగా అనిపించేలా ఎప్పుడూ ప్ర‌వ‌ర్తించ‌లేద‌ని న‌టి తాప్సీ అన్నారు. తాజాగా ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె మాట్లాడారు. ఒక‌ప్పుడు నేను నా జీవితంలో ఒక అడుగు కూడా అనుమ‌తి లేకుండా ముందుకు వేయ‌లేన‌ని అనిపించేది. ఎందుకంటే ఒక అబ్బాయి కంటే అమ్మాయి ఎక్కువ స‌క్సెస్ అవ్వడాన్ని కొంద‌రు అంగీక‌రించ‌రు. కానీ గ‌త 13 ఏళ్లుగా మ‌థియాస్‌తో ఉన్న నా బంధంలో ఎలాంటి మార్పు రాలేదు. ఎప్పుడూ నాకు మా బంధంలో ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ క‌ల‌గ‌లేదు.. అని తాప్సీ అన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె త‌మ కెరీర్‌, వైవాహిక జీవితం, సోష‌ల్ మీడియాలో ఎదుర‌య్యే ట్రోల్స్‌పై త‌న అనుభ‌వాల‌ను పంచుకున్నారు.

అందంగా అంగీక‌రించాలి..

దేశీయ‌, విదేశీయ పురుషుల‌ను ఒకే కోణంలో పోల్చ‌డం స‌రికాద‌ని తాప్సీ అన్నారు. నేను పెళ్లి చేసుకున్నాన‌నే విష‌యాన్నే కొన్ని సార్లు మ‌రిచిపోతాను. నేను చెప్పిందే సరైనది అని అంగీకరించే వ్యక్తి కూడా నాకు అవసరం లేదు. అందంగా అంగీకరించే భాగస్వామి నాకు కావాలి. నేను ఓల్డ్ స్కూల్‌. మొదటి లేదా రెండో డేట్ తర్వాతే స్పష్టత ఉండేది. ఈ బంధం పెళ్లి వరకు వెళ్లే అవకాశం ఉంటేనే ముందుకు సాగాలి, లేకపోతే ఎందుకు ప్రయత్నం? అని భావించేదాన్ని. ఇప్పటివరకు ఎలా ఉందో అలాగే కొనసాగగలిగితేనే పెళ్లి చేసుకుందాం అన్నదే నా నిబంధ‌న.. అని తాప్సీ పేర్కొన్నారు.

వాణిజ్య‌ప‌రంగా అందుక‌నే వెళ్ల‌లేదు..

దీర్ఘ‌కాలికంగా ఏది స‌రిపోతుందో ఇద్ద‌రం చ‌ర్చించుకున్నాం. టోర్నమెంట్ల కార‌ణంగా ఆయ‌న జీవితం ఎప్పుడూ ప్ర‌యాణాల‌తో నిండి ఉంటుంది. విదేశాల్లో నేను కూడా కొంత కాలం ఉన్నా. కానీ శాశ్వ‌తంగా అక్క‌డే ఉండ‌లేన‌ని అర్థ‌మైంది. అందుక‌నే ఇద్ద‌రికీ స‌రిపోయే మార్గాన్ని ఎంచుకున్నాం.. అని తాప్సీ తెలిపారు. నా పెళ్లిని వాణిజ్య‌ప‌రంగా మ‌ల‌చుకునే అవ‌కాశం వ‌చ్చింది. అయిన‌ప్ప‌టికీ వ్య‌క్తిగ‌తంగా జ‌రుపుకోవ‌డానికే ప్రాధాన్య‌త ఇచ్చా. రైట్స్ ఇవ్వ‌డం వ‌ల్ల డ‌బ్బులు బాగా వ‌చ్చి ఉండేవి. అంత‌ర్జాతీయంగా నెట్ ఫ్లిక్స్‌లోనూ క‌నిపించ‌వ‌చ్చు. కానీ మేము సంప్ర‌దాయ బ‌ద్దంగా, స‌న్నిహితంగా పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాం. అందుక‌నే వాణిజ్య‌ప‌ర ధోర‌ణికి వెళ్ల‌లేదు.. అని తాప్సీ వివ‌రించారు.

సోష‌ల్ మీడియాలో వ‌చ్చే కామెంట్ల‌ను, ట్రోల్స్‌ను మేం ప‌ట్టించుకోము. కామెంట్ల‌ను కూడా చ‌ద‌వ‌ము. మేము మా ప్ర‌పంచంలో సంతోషంగా ఉండేందుకే ప్రాధాన్య‌త‌ను ఇస్తాం.. అని తాప్సీ తెలిపారు. కాగా తాప్సీ, మ‌థియాస్ జంట 2023లో వివాహ బంధం ద్వారా ఒక్క‌ట‌య్యారు. ఇక ఆమె సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం హిందీలో వో ల‌డ్‌కీ హై క‌హా, గాంధారి సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM

‘దేవర’ సెట్స్‌లో మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్.. రాజమౌళి నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న వార‌ణాసి చిత్ర షూటింగ్‌ను ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్‌టీఆర్…

Thursday, 16 April 2026, 3:36 PM

మళ్ళీ వాయిదా పడ్డ రామ్ చరణ్ ‘పెద్ది’.. జూన్‌కు వెళ్ళిన మెగా మూవీ! కారణం ఏంటంటే?

రామ్ చ‌రణ్ హీరోగా న‌టిస్తున్న పెద్ది మూవీ విడుద‌ల‌ మ‌రోసారి వాయిదా ప‌డింది. మూవీ అనుకున్న తేదీ ప్ర‌కార‌మే రిలీజ్…

Thursday, 16 April 2026, 11:18 AM

‘బద్రి’లో నా దుస్తులు నేనే డిజైన్ చేసుకున్నా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను సినిమాల్లో న‌టించిన స‌మ‌యంలో త‌న దుస్తుల‌ను తానే డిజైన్ చేసుకుని ధ‌రించే దాన్న‌ని న‌టి రేణు దేశాయ్ తెలిపారు.…

Wednesday, 15 April 2026, 5:58 PM

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM