Sreeleela : వామ్మో.. శ్రీలీల‌ని ఎప్పుడూ ఇలా చూడ‌లేదు.. అవాక్క‌వుతున్న అభిమానులు.. వీడియో..

February 12, 2023 5:19 PM

Sreeleela : టాలీవుడ్‌కి ఎంతో మంది ముద్దుగుమ్మ‌లు ప‌రిచ‌యం అయిన విష‌యం తెలిసిందే. వారిలో శ్రీలీల కూడా ఒక‌రు. ‘పెళ్లి సందD’ తర్వాత శ్రీలీల జోరు మాములుగా లేదు. వరుస చిత్రాలకు ఈ యంగ్ బ్యూటీ సైన్ చేస్తోంది. ధమాకా చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిల‌వ‌డంతో ఈ ముద్దుగుమ్మ‌కి ఆఫ‌ర్స్ బాగానే వ‌స్తున్నాయి. మహేష్ బాబు చిత్రంలో కూడా నటిస్తోంది. నితిన్ తదుపరి చిత్రంలో కూడా శ్రీలీలనే హీరోయిన్. ధ‌మాకా సినిమాలో శ్రీలీల త‌న అందంతో ర‌చ్చ చేసింది. ఈ యంగ్ బ్యూటీ రెచ్చిపోయి పెర్ఫామ్ చేసింది. ముఖ్యంగా సాంగ్స్ లో ఆమె డ్యాన్స్, హావభావాలు కుర్రాళ్ళని కుదురుగా ఉండనీయడం లేదు. పూజ హెగ్డే, రష్మిక లాంటి టాప్ హీరోయిన్లకు కాంపిటీషన్ వచ్చేసింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అయితే శ్రీలీల‌కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట ప్ర‌స్తుతం హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. శ్రీలీలకు సంబంధించి ఓ కన్నడ సినిమా షూటింగ్ వీడియో వైరల్ గా మార‌గా, ఇందులో అమ్మడి అందాలు చూస్తూ ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా బీచ్ లో ఫైట్ ఫీట్స్ చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ వీడియో చూస్తుంటే శ్రీలీలకు అదే డెబ్యూ మూవీలా అనిపిస్తుంది. ఆ వీడియో చూసినవారంతా శ్రీలీలను ఇలా ఎప్పుడూ ఇంత హాట్‌గా చూడలేదంటూ కామెంట్స్ చేయడం విశేషం. కన్నడ హీరోయిన్‌గా శ్రీలీలకు మంచి హిట్లే ఉన్నాయి. కన్నడలో శ్రీలీల మంచి ఫాంలో ఉండగానే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

Sreeleela stunts video viral on social media
Sreeleela

రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందD సినిమాతో తెలుగు వారిని మెప్పించింది శ్రీలీల. తెలుగులో డెబ్యూతోనే శ్రీలీల అదరగొట్టేసింది. ధమాకా సినిమాలో రవితేజ ఎనర్జీని మ్యాచ్ చేసి మెప్పించింది. ఇప్పుడు శ్రీలీల తన డ్యాన్సులతో అందరినీ ఆకట్టుకుంది. టాలీవుడ్‌లో అతి చిన్న హీరోయిన్‌గా రికార్డులు పొందిన ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. చూస్తుంటే ఈ అమ్మ‌డు రానున్న రోజుల‌లో స్టార్ హీరోయిన్‌గా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment