Samantha : అందాల ముద్దుగుమ్మ సమంత ఇటీవల తెగ వార్తలలో నిలుస్తూ వస్తుంది. మయోసైటిస్ అనే వ్యాధి నుండి క్రమంగా కోలుకుంటున్న సమంత ఇప్పుడు తను కమిటైన ప్రాజెక్ట్స్‌పై దృష్టి సారిస్తుంది. సినిమాల విషయంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది. ఆమె తాజాగా నటించిన సినిమా యశోద . ఈ సినిమా 2022 నవంబర్ 11న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సమంత నటించిన శాకుంతలం, ఖుషీ వంటి చిత్రాలు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.అయితే తిరిగి ఫాంలోకి వచ్చిన సమంత.. బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టిందట. ఈ క్రమంలోనే ముంబైకి షిఫ్ట్ అవ్వాలని ఫిక్స్ అయిందట.
ఈ సందర్భంగానే సమంతకు సంబంధించిన వార్త ఒకటి వైరల్ అవుతోంది. సమంత ముంబైలో పదిహేను కోట్లతో ఇళ్లు కొన్నదనే వార్త ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. సినీ సెలబ్రిటీలు ఉండే ఏరియాలో సమంత ఇల్లు కొన్నదని ఇక హైదరాబాద్‌కి గుడ్ బై చెప్పి ముంబైలో ఉంటుందనే వార్త నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఈ వార్తల్లో ఎంత నిజం ఉన్నది సమంతకే తెలియాలి. సమంత ఇప్పుడు తన చేతిలో ఉన్న ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని చూస్తోంది. సమంతకు బాగా లేకపోవడం వల్ల విజయ్ దేవరకొండ ఖుషి ఆగిపోయింది. శివ నిర్వాణ కూడా వేరే సినిమాను చూసుకుందామని అనుకున్నాడు. కానీ ఇంతలో సమంత కోలుకోవడం, షూటింగ్‌లకు ఓకే చెప్పడంతో మళ్లీ ఖుషీ వేగంగా పనులు జరుపుకుంటుంది.
మరోవైపు సిటాడెల్ సెట్‌లో వరుణ్ ధావన్‌తో కలిసి సందడి చేస్తూ ఉంటుంది సమంత. సమంత నటించిన శాకుంతలం సినిమాకు అడుగడునా ఆటంకాలు ఏర్పడుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన శాకుంతలం చిత్రం.. మరోసారి వాయిదా పడింది. ఫిబ్రవరి 17న రావాల్సిన ఈ సినిమాను దిల్ రాజు బృందం వాయిదా వేసింది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్లు అనౌన్స్ చేయనున్నారని తెలుస్తుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…