Samantha : ఇక సెల‌వు.. హైద‌రాబాద్‌కు స‌మంత బై బై..?

February 9, 2023 3:33 PM

Samantha : అందాల ముద్దుగుమ్మ స‌మంత ఇటీవ‌ల తెగ వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తుంది. మ‌యోసైటిస్ అనే వ్యాధి నుండి క్ర‌మంగా కోలుకుంటున్న స‌మంత ఇప్పుడు త‌ను క‌మిటైన ప్రాజెక్ట్స్‌పై దృష్టి సారిస్తుంది. సినిమాల విష‌యంలో చాలా దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తుంది. ఆమె తాజాగా నటించిన సినిమా యశోద . ఈ సినిమా 2022 నవంబర్ 11న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. స‌మంత న‌టించిన శాకుంత‌లం, ఖుషీ వంటి చిత్రాలు ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉన్నాయి.అయితే తిరిగి ఫాంలోకి వచ్చిన సమంత.. బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టిందట. ఈ క్రమంలోనే ముంబైకి షిఫ్ట్ అవ్వాలని ఫిక్స్ అయిందట.

ఈ సందర్భంగానే సమంతకు సంబంధించిన వార్త ఒకటి వైరల్ అవుతోంది. సమంత ముంబైలో పదిహేను కోట్లతో ఇళ్లు కొన్నదనే వార్త ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. సినీ సెల‌బ్రిటీలు ఉండే ఏరియాలో స‌మంత ఇల్లు కొన్న‌ద‌ని ఇక హైద‌రాబాద్‌కి గుడ్ బై చెప్పి ముంబైలో ఉంటుంద‌నే వార్త నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఈ వార్తల్లో ఎంత నిజం ఉన్నది సమంతకే తెలియాలి. సమంత ఇప్పుడు తన చేతిలో ఉన్న ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని చూస్తోంది. సమంతకు బాగా లేకపోవడం వల్ల విజయ్ దేవరకొండ ఖుషి ఆగిపోయింది. శివ నిర్వాణ కూడా వేరే సినిమాను చూసుకుందామని అనుకున్నాడు. కానీ ఇంతలో సమంత కోలుకోవడం, షూటింగ్‌లకు ఓకే చెప్పడంతో మళ్లీ ఖుషీ వేగంగా ప‌నులు జ‌రుపుకుంటుంది.

Samantha reportedly getting shifted from Hyderabad
Samantha

మరోవైపు సిటాడెల్ సెట్‌లో వరుణ్ ధావన్‌తో కలిసి సందడి చేస్తూ ఉంటుంది సమంత. సమంత నటించిన శాకుంతలం సినిమాకు అడుగడునా ఆటంకాలు ఏర్పడుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన శాకుంతలం చిత్రం.. మరోసారి వాయిదా పడింది. ఫిబ్రవరి 17న రావాల్సిన ఈ సినిమాను దిల్ రాజు బృందం వాయిదా వేసింది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్లు అనౌన్స్ చేయనున్నార‌ని తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now