Samantha : మెట్టు మెట్టుపై క‌ర్పూరం వెలిగిస్తూ 600 మెట్లు ఎక్కిన స‌మంత‌

February 14, 2023 1:04 PM

Samantha : అక్కినేని మాజీ కోడ‌లు స‌మంత పేరు ఇటీవ‌లి కాలంలో తెగ మారుమ్రోగిపోతుంది.విడాకుల వ్య‌వ‌హారం ఆ త‌ర్వాత మ‌యోసైటిస్ వ్యాధి బారిన ప‌డ‌డంతో ఆమె హాట్ టాపిక్‌గా మారింది. మయోసైటిస్‌తో చికిత్స తీసుకున్న సమంత ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయిపోయింది. సినిమాలు, వెబ్‌సిరీస్‌ల్లో నటిస్తూనే.. వాటికోసం తనను తాను సిద్ధం చేసుకుంటుంది. జిమ్‌లో కసరత్తులు చేస్తూ మళ్లీ ఫిట్‌గా తయారయ్యేందుకు కృషి చేస్తుంది. శరీరంలో బలహీనపడ్డ రోగ నిరోధక వ్యవస్థను పునరుత్తేజం చేసేందుకకు, ఇతర వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా ఉండేందుకు క‌స‌ర‌త్తులు చేస్తుంది స‌మంత‌.

మ‌రోవైపు ఆధ్యాత్మికంగా కూడా స‌మంత గ‌డుపుతుంది.నాగ చైతన్యతో బ్రేకప్ త‌ర్వాత సమంత ఇండియాలో ప్రముఖ దేవాలయాల్లో పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా త‌న వ‌ర్క్‌కి సంబంధించి కాస్త తీరిక దొరకడంతో సమంత తమిళనాడులోని పళని మురుగన్ స్వామి దేవాలయాన్ని సందర్శించింది. అరుళ్ ముగు శ్రీ దండాయుధపాణి స్వామి క్షేత్రం అని కూడా ఈ ఆలయాన్ని పిలుస్తారు. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని దర్శించాలి అంటే 600 మెట్లు ఎక్కాలి. అలా 600 మెట్లు ఎక్కడ‌మే కాకుండా మెట్టు మెట్టుకూ కర్పూరం వెలిగిస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.

Samantha done puja on steps of temple
Samantha

సమంత కర్పూరం వెలిగిస్తూ మెట్లు ఎక్కుతున్న దృశ్యాలు ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మయోసైటిస్ నుంచి కోలుకున్న తర్వాత మొక్కు తీర్చుకునేందుకు సామ్ ఈ ఆలయాన్ని సందర్శించినట్లు అనుకుంటున్నారు.. సమంత ఫొటోల్లో సింపుల్ గా సల్వార్ కమీజ్ డ్రెస్ ధరించి, మాస్క్ పెట్టుకుని సింపుల్‌గా కనిపిస్తోంది. ప్రస్తుతం సమంత నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఫిబ్రవరి 17న విడుదల చేయాలని భావించినప్పటికీ సమ్మర్‌ సీజన్‌కు వాయిదా పడింది. ఏప్రిల్‌ 14న ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నారు. ఇది కాకుండా రుస్సో బ్రదర్స్‌, రాజ్‌ అండ్‌ డీకే తెరకెక్కిస్తున్న సిటాడెల్‌ వెబ్‌ సిరీస్ షూటింగ్‌లో సామ్‌ పాల్గొంటున్నది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment