RRR Movie : దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఈ సినిమా కోసం మొదటిసారి రామ్‌చరణ్ – తారక్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. చిత్రంలో అలియా భట్ .. రామ్ చరణ్ సరసన కథానాయికగా నటించింది. హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్.. తారక్‌కు జంటగా నటించారు. దక్షిణాది, బాలీవుడ్, హాలీవుడ్‌కు చెందిన పలువురు తారలు ఇందులో కీలకపాత్రలు పోషించారు. సుమారు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మించారు.
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఆర్ఆర్ఆర్ మూవీ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఇందులో హీరోల ఎలివేషన్స్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ సూపర్బ్‌గా ఉన్నాయి. అందుకే దీనికి అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఈ వీడియోకు యూట్యూబ్‌లో అత్యధికంగా వ్యూస్, లైకులు కూడా దక్కుతున్నాయి. ఈ ట్రైలర్ 24 గంటలలో 20.44 మిలియన్ వ్యూస్ రాబట్టగా, బాహుబలి 2 చిత్రం అప్పట్లో 21.81 మిలియన్ వ్యూస్ సాధించింది.
ఎన్నో అంచనాలతో రూపొందిన ఆర్ఆర్ఆర్ ట్రైలర్.. బాహుబలి 2 రికార్డ్ ను సాధించలేకపోవడం గమనార్హం. ఇక వకీల్ సాబ్ ట్రైలర్ 24 గంటలలో 18.05, పుష్ప 15.2, సాహో 12.33, అఖండ 10.49, పెంగ్విన్ 8.47, అరణ్య 8.32, వి మూవీ- 7.45, మహర్షి- 7.31 మిలియన్ల వ్యూస్ సాధించాయి. తెలుగు గడ్డపై పుట్టిన రియల్ హీరోలు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రాజమౌళి రూపొందిస్తోన్న ఈ సినిమాపై అందరిలోనూ అంచనాలు ఉన్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…