RRR Movie : బాహుబ‌లి 2 స్థానం ప‌దిలం.. ఆర్ఆర్ఆర్ రికార్డులు బ్రేక్ చేయ‌లేకపోయిందిగా..!

December 10, 2021 3:46 PM

RRR Movie : దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ సినిమా కోసం మొదటిసారి రామ్‌చరణ్‌ – తారక్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. చిత్రంలో అలియా భ‌ట్ .. రామ్ చ‌ర‌ణ్ సర‌స‌న క‌థానాయిక‌గా న‌టించింది. హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌.. తారక్‌కు జంటగా నటించారు. దక్షిణాది, బాలీవుడ్‌, హాలీవుడ్‌కు చెందిన పలువురు తారలు ఇందులో కీలకపాత్రలు పోషించారు. సుమారు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మించారు.

RRR Movie did not break the records of bahubali

ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఆర్ఆర్ఆర్ మూవీ ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఇందులో హీరోల ఎలివేషన్స్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషన్స్, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ సూపర్బ్‌గా ఉన్నాయి. అందుకే దీనికి అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఈ వీడియోకు యూట్యూబ్‌లో అత్యధికంగా వ్యూస్, లైకులు కూడా దక్కుతున్నాయి. ఈ ట్రైల‌ర్ 24 గంటల‌లో 20.44 మిలియన్ వ్యూస్ రాబట్ట‌గా, బాహుబ‌లి 2 చిత్రం అప్పట్లో 21.81 మిలియ‌న్ వ్యూస్ సాధించింది.

ఎన్నో అంచ‌నాల‌తో రూపొందిన ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్.. బాహుబ‌లి 2 రికార్డ్ ను సాధించ‌లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక వకీల్ సాబ్ ట్రైల‌ర్ 24 గంట‌ల‌లో 18.05, పుష్ప 15.2, సాహో 12.33, అఖండ 10.49, పెంగ్విన్ 8.47, అర‌ణ్య 8.32, వి మూవీ- 7.45, మ‌హ‌ర్షి- 7.31 మిలియ‌న్ల వ్యూస్ సాధించాయి. తెలుగు గడ్డపై పుట్టిన రియల్ హీరోలు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రాజమౌళి రూపొందిస్తోన్న ఈ సినిమాపై అంద‌రిలోనూ అంచ‌నాలు ఉన్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Related Stories

Leave a Comment