వినోదం

వీధి కుక్కలపై వ్యాఖ్యలు.. రేణు దేశాయ్‌పై ఆగని ట్రోలింగ్! ఆవేదన వ్యక్తం చేసిన నటి..

సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యక్తిగత దూషణలపై స్పందించిన రేణు దేశాయ్. Photo Credit: Renu Desai/Instagram.

వీధి కుక్క‌ల‌పై సానుభూతి చూపించాల‌ని మాట్లాడినందుకు త‌న‌ను ఇప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నార‌ని, అస‌భ్య ప‌ద‌జాలంతో దూషిస్తున్నార‌ని న‌టి, సామాజిక కార్య‌క‌ర్త రేణు దేశాయ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోలో మాట్లాడారు. వీధి కుక్క‌ల‌ను పెద్ద సంఖ్య‌లో చంపుతున్నార‌ని కొంద‌రు ఎన్‌జీవోలు త‌న ద‌గ్గ‌రకు వ‌చ్చి ప్రాధేయ‌ప‌డ్డార‌ని, వారి విజ్ఞ‌ప్తితో తాను మీడియా ముందుకు వ‌చ్చి మాట్లాడాన‌ని, అందుకు త‌న‌ను చాలా మంది తిడుతున్నార‌ని విచారం వ్యక్తం చేశారు. వీధి కుక్క‌ల‌ను చంపేందుకు బ‌దులుగా ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఆలోచించాల‌ని చెప్పాన‌ని, అందుక‌ని అప్ప‌టి నుంచి త‌న‌పై ట్రోలింగ్ చేస్తున్నార‌ని పేర్కొన్నారు. దీని వ‌ల్ల త‌న వ్య‌క్తిగ‌త జీవితంలో ఎంతో ఆవేద‌న చెందాల్సి వ‌స్తుంద‌ని అన్నారు.

వీధి కుక్కలు ఉంటే ఎమ్మెల్యేకు చెప్పండి: రేణు దేశాయ్‌

త‌న‌పై కొంద‌రు ఇప్పటికీ అస‌భ్య‌క‌ర‌మైన కామెంట్స్ చేస్తున్నార‌ని రేణు దేశాయ్ అన్నారు. త‌న‌పై ఇంత ద్వేషం ఎందుక‌ని ప్ర‌శ్నించారు. 2012లో త‌న‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో విడాకులు అయిన‌ప్ప‌టి నుంచి త‌న‌పై ర‌క‌ర‌కాలుగా కామెంట్లు చేస్తూనే ఉన్నార‌ని, భ‌ర‌ణం తీసుకున్నాన‌ని, రాజ‌కీయ పార్టీకి బానిస‌న‌ని ఇలా ర‌క‌ర‌కాలుగా తిడుతున్నార‌ని చెప్పారు. 100 వీధి కుక్క‌ల్లో 10 పిచ్చి కుక్క‌లు ఉంటాయ‌ని, వాటి కోసం మిగిలిన 90 కుక్క‌ల‌ను చంపడం స‌రికాద‌ని చెప్పాన‌ని, అయినా వీధి కుక్క‌ల స‌మ‌స్య ఉంటే లోక‌ల్ ఎమ్మెల్యే, కార్పొరేట‌ర్‌ల‌కు చెప్పాలి కానీ త‌న‌ను ఎందుకు తిడుతున్నార‌ని ప్ర‌శ్నించారు. సోష‌ల్ మీడియాలో త‌న వ్యాఖ్య‌ల‌ను వ‌క్రీక‌రిస్తూ కామెంట్లు పెడుతుండ‌డం బాధగా ఉంద‌ని చెప్పారు. త‌న యాక్టింగ్ బాగాలేక‌పోతే చెప్పాల‌ని, కానీ త‌న వ్య‌క్తిగ‌త జీవితంపై విమ‌ర్శ‌లు చేయ‌వ‌ద్ద‌ని హెచ్చ‌రించారు.

సోష‌ల్ మీడియాలో త‌న‌ను బూతులు తిడుతున్న వారు ఒక‌సారి త‌మ మ‌న‌స్సాక్షిని తాము ప్ర‌శ్నించుకోవాల‌ని రేణు దేశాయ్ అన్నారు. వారికి ఇంట్లో అమ్మ‌, అక్క‌, చెల్లి లేరా అని ప్ర‌శ్నించారు. కొంద‌రు సోష‌ల్ మీడియాలో మ‌రీ నీచంగా కామెంట్లు పెడుతున్నార‌ని, ఇది ఎక్క‌డి సంస్కార‌మో త‌న‌కు అర్థం కావ‌డం లేద‌ని విచారం వ్య‌క్తం చేశారు. ఇకపై ఇలాంటి కామెంట్ల‌ను స‌హించ‌బోన‌ని, కామెంట్లు చేసేవారు ఎక్క‌డ ఉన్నా స‌రే వారి ఇంటికి వెళ్లి ఆ కామెంట్లను వారి ఇంట్లోని కుటుంబ స‌భ్యుల‌కు చూపిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘బద్రి’లో నా దుస్తులు నేనే డిజైన్ చేసుకున్నా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తాను సినిమాల్లో న‌టించిన స‌మ‌యంలో త‌న దుస్తుల‌ను తానే డిజైన్ చేసుకుని ధ‌రించే దాన్న‌ని న‌టి రేణు దేశాయ్ తెలిపారు.…

Wednesday, 15 April 2026, 5:58 PM

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు…

Tuesday, 14 April 2026, 7:27 PM

ఐపీఎల్ జట్టు ఎందుకు కొనలేదు? అసలు నిజం చెప్పిన అభిషేక్ బచ్చన్.. అంత బడ్జెట్ నా దగ్గర లేదు!

నటుడు అభిషేక్ బచ్చన్ కబడ్డీ, ఫుట్‌బాల్ జట్ల యజమానిగా విజయవంతంగా నిలిచినప్పటికీ, ఇప్పటివరకు ఐపీఎల్ జట్టును కొనుగోలు చేయలేదు. అయితే…

Tuesday, 14 April 2026, 5:35 PM

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ…

Tuesday, 14 April 2026, 3:21 PM

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి…

Saturday, 11 April 2026, 8:35 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో…

Friday, 10 April 2026, 6:40 PM

విజయ్ ‘జననాయకన్’ లీక్.. 5 నిమిషాల యాక్షన్ సీన్ నెట్టింట వైరల్! షాక్‌లో చిత్ర యూనిట్..

తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…

Friday, 10 April 2026, 12:43 PM

ప్రొపగాండా అంటే ఏంటి? ‘ధురంధర్ 2’ విమర్శకులపై సందీప్ రెడ్డి వంగా నిప్పులు!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధ‌ర్ 2 ది…

Thursday, 9 April 2026, 11:07 PM